Actor Bharath: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్ భరత్.. అచ్చం హీరో కటౌట్తో..
తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో చిన్నప్పుడే తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో మెప్పించారు. ఇప్పుడు అందులో చాలా మంది వెండితెరపై హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. మరికొందరు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఒకరు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, పోకిరి, అందాల రాముడి, దుబాయ్ శీను వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు 80కి పైగా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన భరత్.. తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగు, తమిళంలో అనేక భాషలలో నటించిన భరత్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.
అయితే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన భరత్.. ఆ తర్వాత హీరోగానూ మెరిశాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాలో సెకండ్ హీరోగా కనిపించాడు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమాలో కనిపించాడు. అయితే కొంతకాలంగా భరత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. చిన్న వయసులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భరత్.. పెద్దయ్యాక మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. చిన్నప్పుడు బొద్దుగా ఉన్న భరత్.. ఇప్పుడు కసరత్తులు చేసి సిక్స్ పాక్ బాడీతో యంగ్ హీరోలకు పోటీగా రెడీ అయ్యాడు.
పెద్దయ్యాక పలు చిత్రాల్లో నటించిన భరత్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా భరత్ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో భరత్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..