Tollywood: 40 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోసంచలనం.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్.. ఆమె తల్లి రియాక్షన్ ఇదే..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ జోరు మీదుంది ఈ హీరోయిన్. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రచ్చ చేస్తుంది. తెలుగు, తమిళం భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది ఈ హీరోయిన్. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. 41 ఏళ్ల వయసులో పెళ్లికి దూరంగా ఉంటూ ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకు గట్టి పోటినిస్తుంది. ఈ క్రమంలోనే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె సినిమాలు మానేయబోతుందని.. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ త్రిష. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన 2023 చిత్రం. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించింది. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గోట్. ఇందులో ఈ చిత్రంలో స్నేహ, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో మట్టా అనే పాటలో మెరిసింది.
త్రిష వరుసగా 22 ఏళ్లుగా హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అమీర్ దర్శకత్వం వహించిన మౌనం పసియేట్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, విక్రమ్ చియాన్, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. అయితే ప్రస్తుతం త్రిష సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని.. త్వరలోనే ఆమె రాజకీయాల్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై త్రిష తల్లి వివరణ ఇచ్చింది. తన కూతురు రాజకీయాల్లోకి వెళ్లడం లేదని.. ఆమె సినిమాలను ఎప్పటికీ విడిచిపెట్టదని తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
ప్రస్తుతం త్రిష చేతిలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అందులో అజిత్ జోడిగా విడుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ తో థగ్ లైఫ్, చిరంజీవితో విశ్వంభర్, సూర్య 45, 96 పార్ట్ 2 వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..