Max OTT: అఫీషియల్.. ఓటీటీలో కిచ్చా సుదీప్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. మ్యాక్స్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు వారందరికీ చేరువయ్యాడు సుదీప్. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి తదితర తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడీ స్టార్ హీరో.

రక్త చరిత్ర-1,2 సినిమాలతో మొదటిసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి ఈగ సినిమాతో టాలీవుడ్ లోనూ ఫేమస్ అయిపోయాడు. ప్రభాస్ బాహుబలి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు చేరువైపోయాడీ స్టార్ హీరో. అందుకే తన కన్నడ సినిమాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు సుదీప్. అలా రిలీజ్ చేసిన విక్రాంత్ రోణ తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే క్రమంలో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్, శరత్ లోహితస్య, ఉగ్రం మంజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబరు 27న కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాక్స్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సుదీప్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉండడంతో మ్యాక్స్ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
మ్యాక్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. తాజాగా సుదీప్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మ్యాక్స సినిమా స్ట్రీమింగ్ రానుంది. దీనిపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జీ5 బదులిస్తూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను మ్యాక్స్ సినిమాను నిర్మించారు. ఉగ్రం మంజు, ఇళవరసు, సంయుక్త హోర్నార్డ్, సుధా బేల్ వాడి, వంశీ కృష్ణ, అడుకలం నరేన్, ప్రమోద్ శెట్టి, రెడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విరూపాక్ష, మంగళవారం సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మ్యాక్స్ సినిమాకు స్వరాలందించారు. మరి థియేటర్లలో మ్యాక్స్ సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్దిరోజులు ఆగండి.. ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు.
జీ5లో స్ట్రీమింగ్..
ಯುದ್ಧ ಹುಟ್ಟಾಕೋರನ್ನ ಕಂಡ್ರೆ ಆಗಲ್ಲ, ಯುದ್ಧಕ್ಕೆ ಹೆದರಿ ಓಡೋರನ್ನ ಕಂಡ್ರಂತೂ ಇವನಿಗೆ ಆಗೋದೇ ಇಲ್ಲ..! ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಅಭಿನಯದ Maximum ಮನರಂಜನೆಯ ‘Max’ | ಫೆಬ್ರವರಿ 15ರಂದು ರಾತ್ರಿ 7:30ಕ್ಕೆ.#Max #WTP #KicchaSudeepa #ZeeKannada #BayasidaBaagiluTegeyona pic.twitter.com/BE4AwWa5Ig
— Zee Kannada (@ZeeKannada) February 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.