- Telugu News Photo Gallery Cinema photos Roja DaughterAnshu Malik Ramp Walk At Global Entrepreneurship Festival In Nigeria, See Photos
Tollywood: మరో హీరోయిన్ దొరికేసినట్టే! ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తు పట్టారా?
సీనియర్ హీరో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు సినిమా ఇండస్ట్రీలోకి రావడం సహజమే. తమ తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ మంచి యాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంటారు. అలా ఒక స్టార్ కిడ్ ఇప్పుడు టాలీవుడ్ లోకి వచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
Updated on: Feb 08, 2025 | 1:39 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ నటి కూతురు. ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ తళుక్కుమంది.

తల్లి బాటలోనే మెల్లగా అడుగులు వేస్తోన్న ఆమె నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్'లో సందడి చేసింది.

ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం తన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసుకుంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేసినట్టేనంటున్నారు.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు స్టార్ నటి కమ్ పొలిటిషియన్ రోజా కూతురు అన్షు మాలిక్. రైటర్ గా, వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తోందీ స్టార్ కిడ్.

ఇప్పుడు ఏకంగా ఫ్యాషన్ షోలోనూ తళుక్కుమంది. అందరి ముందు ఏ మాత్రం భయం లేకుండా ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.





























