AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం.. గుర్తు పట్టారా?

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు సినీ సెలబ్రిటీలు తరలి వస్తున్నారు. సామాన్యుల్లా భక్తుల్లో కలిసిపోయి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఒకరు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను దర్శించుకుంది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం.. గుర్తు పట్టారా?
Maha Kumbh Mela
Basha Shek
|

Updated on: Feb 08, 2025 | 12:10 PM

Share

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో భాగమవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాకు తరలివస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున మహా కుంభమేళాను దర్శించుకున్నారు. ఇప్పటికే సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్ తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఈ ఆధ్యాత్మిక వేడుకలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వచ్చిన ఆమె పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం ఆచరించింది. అనంతరం నాగ సాధువుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. తన మహా కుంభమేళా యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది దిగంగన. ‘జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చిందీ అందాల తార.  ప్రస్తుతం ఇవి నెట్టింట వైరలవుతున్నాయి.

దిగంగన సూర్య వంశీ విషయానికి వస్తే.. మొదట బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఫ్రైడే, జలేబి, రంగీలా రాజా తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2019లో కార్తికేయతో కలిసి హిప్పీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత వలయం, సిటీమార్, క్రేజీ ఫెలో, శివం భజే సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో దిగంగన సూర్య వంశీ..

ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది దిగంగన. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..