Champions Trophy 2025: ఆసీస్‌కు మరో భారీ షాక్.. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పోటీలో పాల్గొనే మొత్తం 8 జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. కాగా ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోన్న ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది.

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అలాగే వన్డే కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ ఇద్దరు కూడా టోర్నమెంట్‌కు దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ వన్డే క్రికెట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘నా ఈ నిర్ణయం అంత సులభం కాదు. కానీ వన్డే క్రికెట్ నుంచి వైదొలిగి నా కెరీర్‌లోని తదుపరి అధ్యాయంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అని నేను నమ్ముతున్నాను’ అని మార్కస్ స్టోయినిస్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగానే స్టోయినిస్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు రాబోయే టోర్నమెంట్ కోసం ప్రత్యామ్నాయ ఆల్ రౌండర్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.
అంతకుముందు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టులో మార్కస్ స్టోయినిస్‌కు చోటు లభించింది. అయితే, స్టోయినిస్ ఇప్పుడు తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించనున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ, తాను టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని చెప్పాడు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజ్ లీగ్‌పై మరింత దృష్టి పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు.
“This wasn’t an easy decision, but I believe it’s the right time for me to step away from ODIs and fully focus on the next chapter of my career”
Australia allrounder Marcus Stoinis has announced his ODI retirement and won’t feature in the upcoming Champions Trophy pic.twitter.com/xUkVr7D3wl
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2025
మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా తరఫున 71 వన్డేలు ఆడాడు. మొత్తం 64 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి, 1 సెంచరీ, 6 అర్ధ సెంచరీలతో సహాయంతో 1495 పరుగులు సాధించాడు. అలాగే 48 వికెట్లు కూడా పడగొట్టాడు.
Australia in BIG BIG trouble ahead of the Champions Trophy 2025! 😱
Pat Cummins ruled out 🚫 Josh Hazelwood ruled out 🚫 Mitchell Marsh ruled out 🚫 Cameron Green ruled out 🚫 Marcus Stoinis retired ⚡
A major shake-up for the Aussies!
#Australia #ChampionsTrophy2025… pic.twitter.com/EvwyQ15fpw
— Cricadium CRICKET (@Cricadium) February 6, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..