Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాల నుంచి రోజుకు కోట్లాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక సినీ తారలు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Maha Kumbh Mela
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2025 | 1:36 PM

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రయాగ్ రాజ్‌ కుంభమేళాకు తరలివస్తున్నారు. సంయుక్త మేనన్, పూనమ్ పాండే, యాంకర్ లాస్య, పవిత్ర గౌడ.. పలువురు సినీ ప్రముఖులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అంతేకాదు తమ యాత్రాను భవాలను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు.

తాజాగా పాన్ ఇండియా హీరోయిన్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మహా కుంభమేళాలో మెరిసింది. తన తండ్రితో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొందీ అందాల తార. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా సింపుల్ సామాన్య భక్తురాలిగా మారిపోయి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. అనంతరం తన కుంభమేళా యాత్రకు సంబంధించిన ఫొటోలు, విశేషాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంది. ‘నిజంగా ప్రయాగ్ రాజ్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. మొదట్లో నాకున్న వర్క్ బిజీ వల్ల ఇక్కడకు రావడానికి కుదరదేమోనని అనుకున్నాను’

ఇవి కూడా చదవండి

‘కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ నా పనుల్లన్నింటిని పక్కన పెట్టి వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. దీనికి ప్రధాన కారణం మా నాన్న. చివరి నిమిషంలో మనం కుంభమేళాకి వెళుతున్నామంటూ డాడీ నాకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది నిజంగా మన జీవితంలో ఒకసారి జరిగేది, వచ్చేది కాబట్టి ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు అడగకుండా నాన్నకు ఓకే చెప్పేశాను. ప్రస్తుతం నేను కుంభమేళాలోనే ఉన్నాను. ఇక్కడి ఒక్కొక్క అనుభవం, జీవితాంతం జ్ఞాపకం’ అని రాసుకొచ్చింది శ్రీనిధి శెట్టి.

ప్రయాగ్ రాజ్ లో శ్రీనిధి శెట్టి.. వీడియో..

ప్రస్తుతం శ్రీనిధి శెట్టి షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డసరసన ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తోంది. శ్రీనిధి. అలాగే నాని హిట్ 3 లోనూ కనిపించనుంది.

మహా కుంభమేళాలో ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.