సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు. అదే సమయంలో కేసుల కారణంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఛాన్సులు జానీకి దూరమయ్యాయి.
తాను ఏ తప్పూ చేయలేదని.. విచారణలో అన్ని నిజాలు బయటికొస్తాయంటోన్న జానీ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తాజాగా అతనికి మరో సినిమా అవకాశం వచ్చింది. కన్నడలో తెరకెక్కుతోన్న ఓ సినిమాకు జానీ వర్క్ చేయనున్నాడు. తాజాగా తన కొత్త సినిమా సెట్ కు వెళ్లాడు మాస్టర్. అయితే అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌కి గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వనించింది ఆయన టీం. అనంతరం కేక్ కట్ చేయించి మరీ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంతటి ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడీ స్టార్ కొరియోగ్రాఫర్. చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యూవర్స్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీమ్ ప్రతి ఒక్కరికీ ఎంతో రుణపడి ఉంటాను’ అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐకాన్ స్టార్‌తో.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా
సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??
ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్ యాక్షన్
మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్ స్టేట్‌మెంట్లతో..

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
