సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి బాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ ఘటనతో ముంబై లాంటి మహా నగరంలో సెలబ్రిటీల భద్రతపై సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా దాడి సమయంలో సైఫ్- కరీనాల ఇంట్లో సెక్యూరిటీ గార్డులు లేరా? అని చాలామంది ప్రశ్నలు లేవనెత్తారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు, దర్శకుడు ఆకాశ్‌దీప్ సబీర్, అతని భార్య షీబా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇంటిని భద్రంగా ఉంచుకోవడానికి కరీనా వద్ద డబ్బుల్లేవా’ అంటూ సూటిగా ప్రశ్నించారు. కరీనా కపూర్ ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకుంటోందని… కనీసం ఇంటి బయట వాచ్ మెన్ ను పెట్టుకోలేకపోతున్నారా అంటూ వారు కరీనాను ప్రశ్నించారు. అలాగే సైఫ్ పై దాడి జరిగినప్పుడు అక్కడ కారు డ్రైవర్లు ఎవరూ లేరు. అందువలన అతను ఆటోలో ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ వాళ్లకు రూ.100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే వాళ్లు సెక్యూరిటీని, డ్రైవర్‌ను పెట్టుకుంటారేమో’ అని సెటెరికల్ కామెంట్స్ చేశారు ఆకాశ్ దీప్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్ యాక్షన్
మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్ స్టేట్‌మెంట్లతో..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

