ఐకాన్ స్టార్‌తో.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా

ఐకాన్ స్టార్‌తో.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా

Phani CH

|

Updated on: Feb 05, 2025 | 1:16 PM

మహా కుంభమేళా కారణంగా ఓవర్‌ నైట్ ఫేమస్ అయిపోయిన వారిలో మోనాలిసా భోంస్లే ఒకరు. మధ్య ప్రదేశ్ ఇండోర్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ అమ్మాయి జీవనోపాధి కోసం కుంభమేళాకు వచ్చింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ కొందరు యూట్యూబర్ల కంట పడింది. అంతే క్షణాల్లోనే మోనాలిసా ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలైపోయాయి.

దేశ వ్యాప్తంగా ఈ అమ్మాయి పేరు మార్మోగిపోయింది. ఎంతలా అంటే మోనాలిసాను వెతుక్కుంటూ ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. తనతో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు మోనాలిసా మరో పోస్టుతో వైరల్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్‌’ లో మోనాలిసా నటించనుంది. ఇటీవలే డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక సినిమా ఆఫర్ రావడంతో మోనాలిసాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే మోనాలిసా తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పోస్టర్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో నెట్టింట వైరలైపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??

ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్‌ యాక్షన్‌

మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్‌ స్టేట్‌మెంట్లతో..

భర్త చేతుల మీదుగా.. అందాల రాక్షసి నయా సినిమా…