అవును.. అలా పెట్టడం నా తప్పేనండీ.. క్షమించండి..
కృష్ణవంశీ.. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు . ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.
అప్పటి నుంచి తన స్టైల్ తో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, తాజాగా సినిమాలు తగ్గించారు. కానీ అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్‌తో మింగిల్ అవ్వడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు ఈయన. సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ తాజాగా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. హారర్ జోనర్ లో ఓ మూవీ చేస్తే చూడాలని ఉంది అని ఓ అభిమాని కోరగా .. తనకు కూడా హారర్ మూవీ చేయాలని ఉందన్నారు. వేరే లెవల్ లో ట్రై చేద్దాం. కొంచెం టైం పడుతుందన్నారు. మరో అభిమాని శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మిని ఎందుకు అలా చూపించారు అని అడగ్గా.. తప్పేనండి.. క్షమించండి.. తీరని సమయాలు, తీరని చర్యలు, తీరని పనులు అంటూ రిప్లయ్ ఇచ్చారు కృష్ణవంశీ. ఇలా సమాధానం ఇవ్వడం కూడా కృష్ణవంశీ క్రియేటివిటీయే అనుకుంటున్నారు అభిమానులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ
ఐకాన్ స్టార్‌తో.. మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా
సినిమాకు రూ.21 కోట్లు.. కనీసం వాచ్ మెన్‌ను పెట్టుకోలేరా ??
ఆరాధ్యపై ఫేక్ న్యూస్.. ఐశ్వర్య సీరియస్ యాక్షన్
మళ్లీ ఐటీ కార్యాలయానికి దిల్ రాజు.. ఈసారి బ్యాంక్ స్టేట్‌మెంట్లతో..

నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్ కింద రూ.3 కోట్ల ఇల్లు

రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. వీడియో

తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..వీడియో

ఓర్నీ.. ఈ ఎలక్ట్రీషియన్ తెలివికి అవార్డ్ ఇవ్వాల్సిందే..!

ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు!వీడియో

వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!

రైతు వెళ్లే దారిలో పులి.. తర్వాత ఏం జరిగిందంటే...?వీడియో
