AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అరంగేట్రం మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. జైస్వాల్ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే..

Yashasvi Jaiswal stunning catch: "క్యాచ్ పట్టు, మ్యాచ్ గెలువు" అనే నానుడి క్రికెట్‌లో ఉండనే ఉంది. తాజాగా టీం ఇండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కూడా తన అద్భుత ఫీల్డింగ్‌తో సత్తా చాటి ఇంగ్లండ్ జట్టుకు కోలుకోలేని షాక్ అందించాడు. తనలాగే అరంగేట్రం చేస్తున్న హర్షిత్ రాణా బౌలింగ్‌లో జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ డేంజరస్ ప్లేయర్లను ఎలా పెవిలియన్ చేర్చారో ఓసారి చూద్దాం..

Video: అరంగేట్రం మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. జైస్వాల్ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే..
Yashasvi Jaiswal Stunning C
Venkata Chari
|

Updated on: Feb 06, 2025 | 3:20 PM

Share

టీం ఇండియా వన్డే జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు అరంగేట్రం చేశారు. తొలిసారి వన్డే ఆడుతున్నప్పటికీ.. నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌ భారీ షాక్ అదించి, అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఒకానొక సమయంలో భారీ స్కోరు సాధించే మూడ్‌లో కనిపించిన ఇంగ్లాండ్ జట్టుకు, టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇద్దరు ఆటగాళ్ళు – యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు. హర్షిత్ వేసిన బంతిని యశస్వి క్యాచ్ పట్టిన విధానం చూస్తే.. మెచ్చుకోకుండా ఉండలేదరంతే. ఈ క్యాచ్‌తో మ్యాచ్ గమనమే మారిపోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ స్కోరు బోర్డు కొంత నియంత్రణలోకి వచ్చేలా చేశారు.

బెన్ డకెట్‌ను పెవిలియన్ చేర్చిన ఇద్దరు అరంగేట్రం ఆటగాళ్ళు..

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు ఇద్దరూ స్కోరు బోర్డును వేగంగా పెంచుతూ కనిపించారు. కానీ, వారి సమన్వయ లోపానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఫిల్ సాల్ట్ రనౌట్ అయ్యాడు. అయితే, బెన్ డకెట్ రూపంలో డాషింగ్ బ్యాట్స్‌మన్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. బెన్ డకెట్ అనే ఈ ముప్పును తొలగించే పని టీమిండియాకు చెందిన ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్ళు తీసుకున్నారు.

కళ్లు చెదిరే క్యాచ్..

జైస్వాల్ తన మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్‌ను పెవిలియన్ చేర్చాడు. వెనుకకు పరిగెత్తుతూ, రెండు చేతులతో అద్బుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..