OTT Movie: 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ఈ వారం లో కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి.

OTT Movie: 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2025 | 12:37 PM

రంగం సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు కోలీవుడ్ హీరో జీవా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర 2లో వైఎస్ జగన్ పాత్రలో అత్యద్భుతంగా నటించి మెప్పించాడు హ్యాండ్సమ్ హీరో. అలా గతేడాది తమిళంలో జీవా నటించిన చిత్రం బ్లాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘కోహెరెన్స్ ‘అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు బాల‌సుబ్ర‌మ‌ణి డార్క్ ఈ సినిమాను రూపొందించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కాన్సెప్ట్‌కు కాస్త సస్పెన్స, హారర్, థ్రిల్లర్ వంటి అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియెన్స్ మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డార్క్ పేరుతో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఎలాంటి ముందస్తు ప్రకటన, సమాచారం లేకుండానే డార్క్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.

ఆ విల్లాలో ఏముంది?

జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించిన డార్క్ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ప్రొటాన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రభు, ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌బాబు ఈ సినిమాను నిర్మించారు. వివేక్ ప్రసన్న, యోగ్ జపీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డార్క్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. కాగా ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భ‌వానీ శంక‌ర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేప‌థ్యంలోనే సాగ‌డం గ‌మ‌నార్హం. మరి ఓటీటీలో మంచి హారర్, సస్పెన్స్,థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే డార్క్ మీకు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..