AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Thottempudi: చిక్కుల్లో టాలీవుడ్ హీరో వేణు! పోలీస్ కేసు నమోదు! కారణమిదే

1999లో వచ్చిన స్వయం వరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వేణు తొట్టెంపూడి. తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. సోలో హీరోగా పలు సూపర్ హిట్స్ కొట్టాడు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

Venu Thottempudi: చిక్కుల్లో టాలీవుడ్ హీరో వేణు! పోలీస్ కేసు నమోదు! కారణమిదే
Venu Thottempudi
Basha Shek
|

Updated on: Feb 05, 2025 | 1:06 PM

Share

స్వయం వరం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు వేణు. మొదటి సినిమతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, అల్లరే అల్లరి, బహుమతి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు. అలాగే వెంకటేష్ చింతకాలయ రవి, ఎన్టీఆర్ దమ్ము లాంటి సినిమాల్లో సహాయక నటుడిగానూ మెప్పించాడు. 2013 తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయాడు వేణు. మళ్లీ 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే అతిథి అనే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న వేణు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో ప్రతినిధిగా ఉన్నాడు నటుడు వేణు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది. ఇద సమయంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఫిర్యాులో పేర్కొన్నారు. తాజాగా నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతోపాటు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులు భాస్కరరావు హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.