Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: స్టార్ డైరెక్టర్ ఆఫీస్‌లో చిరంజీవి ఫొటో.. ఏ సినిమాలోనిదో కనిపెట్టారా? దీని వెనక ఇంత స్టోరీ ఉందా?

భారతీయ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందుకే యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలు, డైరెక్టర్లు అందరూ ఆయనను అభిమానిస్తారు.

Chiranjeevi: స్టార్ డైరెక్టర్ ఆఫీస్‌లో చిరంజీవి ఫొటో.. ఏ సినిమాలోనిదో కనిపెట్టారా? దీని వెనక ఇంత స్టోరీ ఉందా?
Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Feb 06, 2025 | 1:13 PM

గత రెండో రోజులుగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో చిరంజీవి యంగ్‌ లుక్‌లో కనిపించారు. కేవలం పింక్‌ బనియన్‌ ధరించి, వైట్‌ టవల్ మెడకు చుట్టుకుని కోపంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇది ఉన్నది అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఫేమ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆఫీస్ లో. దీనిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఇది ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇది చిరంజీవి సాధారణంగా పోజులిచ్చే ఫోటో కాదు. అది ఒక సినిమాలోని సన్నివేశం పోస్టర్. ఇప్పుడీ పోస్టర్ నేపథ్య దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దీనిని చూసిన చాలా మంది మెగాస్టార్ తో సినిమా చేయాలని సందీప్ వంగాను కోరుతున్నారు. సందీప్ రెడ్డి చిరంజీవికి పెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సందీప్ ఇంట్లో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆరాధన సినిమాలోనిది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే సుహాసిని హీరోయిన్‌గా నటించింది. రాజశేఖర్, రాధిక కీలక పాత్రలు పోషించారు.

ఆరాధన సినిమాలో పులిరాజుగా పలు షేడ్స్ లో కనిపించారు చిరంజీవి. సినిమా ప్రారంభంలో బజార్ రౌడీగా, ఆ తర్వాత పరివర్తన చెందిన మనిషిగా, సుహాసినీని ప్రేమించిన వాడిగా అద్భుతంగా నటించారు చిరంజీవి. ఈక్రమంలోనే సందీప్‌ రెడ్డి వంగాకి ఈ `ఆరాధన` సినిమా, అందులోని చిరంజీవి పాత్ర బాగా నచ్చాయట. ఈ మూవీ చూసి మెగాస్టార్‌కి అభిమాని అయిపోయారట. అందుకే ఆ గుర్తుగా ఈ ఫొటోని తన ఆఫీసులో పెట్టుకున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగా పోస్ట్..

సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’. మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద 900 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలోహీరోగా నటిస్తున్నాడు. నిజాయితీపరుడైన పోలీస్ అధికారి పాత్రలో డార్లింగ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..