- Telugu News Photo Gallery Cinema photos Allu Aravind Says The Reason Behind Why He Selected Sai Pallavi For Naga Chaitanya Thandel Movie
Thandel : తండేల్ సినిమాకు సాయి పల్లవిని తీసుకోవడానికి రీజన్ అదే.. అల్లు అరవింద్ కామెంట్స్..
సహజ సౌందర్యం.. అద్భుతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి జనాలను మంత్రముగ్దులను చేసింది. సాయి పల్లవి సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద జాతరే అన్నట్లుగా ఫ్యాన్ బేస్ కలిగి ఉంది.
Updated on: Feb 06, 2025 | 1:06 PM

గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తండేల్ సినిమాకు సాయి పల్లవిని తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.

ఈ సినిమాలో సాయి పల్లవి ఎంపిక తన నిర్ణయమే అని.. ఇది కమర్షియల్ నిర్ణయమని చెప్పినట్లు తెలిపారు. ఈ పాత్ర కోసం ముంబై వెళ్లి ఎవరినీ తీసుకురాలేదని.. ముంబాయి హీరోయిన్స్ ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించిందని అన్నారు.

ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. సాయి పల్లవి అయితే వంద శాతం న్యాయం చేయగలదని.. ఆమె అసాధారణమైన నటి అని.. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. తాము అనుకున్నట్లుగానే సాయి పల్లవి తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పుకొచ్చారు.




