AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Razakar OTT: ఓటీటీలో రజాకార్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. టాప్ ట్రెండ్‌లో హిస్టారికల్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

భార‌త‌దేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం రజాకార్. గతేడాది మార్చి 15న థియేటర్లోల విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ హిస్టారికల్ మూవీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Razakar OTT: ఓటీటీలో రజాకార్ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. టాప్ ట్రెండ్‌లో హిస్టారికల్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Razakar Movie
Basha Shek
|

Updated on: Feb 08, 2025 | 10:06 AM

Share

బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాట సత్యనారాయణ దరకత్వం వహించారు. 1940 దశకంలో రజాకార్లు సాగించిన అకృత్యాలకు తెరరూపమిచ్చిందీ మూవీ. గతేడాది మార్చి 15న థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రతి రివ్యూలోనూ సినిమా మేకింగ్ , సీన్స్ బాగున్నాయంటూ విశ్లేషకులు అప్రిషియేట్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ అయిన పది నెలల తర్వాత రజాకార్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. గత నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రజాకార్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఈ సినిమా నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 50 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ అందుకుని దూసుకెళుతోంది.

రజాకార్ వ్యవస్థను నేపథ్యంగా ఎంచుకుని కథే హీరోగా దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రజాకార్ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన తీరు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల దాకా అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాంకేతిక నిపుణుల ప్రతిభతో పాటు బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ నటన ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తోంది.  థియేటర్లలో విడుదలైన దాదాపు 10 నెలల తర్వాత రజాకార్ సినిమా ఓటీటీలో రావడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలయింది. ఇప్పుడు ఓటీటీలోనూ అన్ని భాషల్లోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే మరెందుకు లేటు.. ఎంచెక్కా ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

బండి సంజయ్ ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి
ఆ స్టార్ హీరోయిన్ నేను నా బైక్ మీద తిరిగేవాళ్లం..
ఆ స్టార్ హీరోయిన్ నేను నా బైక్ మీద తిరిగేవాళ్లం..
అపర కుబేర యోగం.. వీరికి ఇక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
అపర కుబేర యోగం.. వీరికి ఇక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ప్రకృతి ప్రసాదించిన అద్భుతం కొర్రలు.. ఇది తెలిస్తే అస్సలు వదలరు
ప్రకృతి ప్రసాదించిన అద్భుతం కొర్రలు.. ఇది తెలిస్తే అస్సలు వదలరు
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? 10th టూ PG అందరికీ సూపర్ ఛాన్స్‌
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? 10th టూ PG అందరికీ సూపర్ ఛాన్స్‌
ఈ రాశులకు గజకేసరి యోగం..అనేక రకాలుగా అదృష్టాలు గ్యారంటీ..!
ఈ రాశులకు గజకేసరి యోగం..అనేక రకాలుగా అదృష్టాలు గ్యారంటీ..!
ఫేమస్ బాబా రియల్ లైఫ్ స్టోరీ.. OTTకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్
ఫేమస్ బాబా రియల్ లైఫ్ స్టోరీ.. OTTకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్