AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు బ్యాంకులో రూ.550.. ఫస్ట్ జీతం రూ.4800.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్..

2003లో తన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాలో రూ.550 మాత్రమే ఉందని, తన నెల జీతం రూ.4,800 అని చెప్పాడు. తన సొంత నిబంధనలపై ముందుకు సాగడం.. సొంత నిబంధనలకు అనుగుణంగా జీవించడమే తనకు ముఖ్యమని తెలిపాడు. తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, తాను ఎవరికీ మిత్రుడని, శత్రువు కాదని నటుడు అన్నారు.

Tollywood: ఒకప్పుడు బ్యాంకులో రూ.550.. ఫస్ట్ జీతం రూ.4800.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్..
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2024 | 12:50 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హంక్ అంటే హీరో జాన్ అబ్రహం. ప్రస్తుతం సినీరంగంలోకి తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యా్క్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోన్న హీరో. ఇటీవలే వేదా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. ఓవైపు శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుండడంతో వేదా చిత్రానికి అంతగా రెస్పాన్స్ రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో తన సింపుల్ లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపాడు. తన వద్ద లగ్జరీ కారు, ఖరీదైన డిజైనర్ దుస్తులు లేవని, సాదాసీదా జీవితాన్ని గడపడానికే ఇష్టపడతానని చెప్పాడు. 2010లో ‘ఆప్ కి అదాలత్’ షోలో, జాన్, బాలీవుడ్‌లో తన మొదటి ఏడేళ్లను గుర్తుచేసుకుంటూ పరిశ్రమలో ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి రావడంతో తాను చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నానని.. అలాగే వాటిని అంగీకరించానని చెప్పాడు.

షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల మాదిరిగానే తాను కూడా ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. కానీ ఇక్కడ మెయింటెన్ చేయ‌డం కాస్త క‌ష్ట‌మేన‌ని, త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాన‌ని జాన్ అన్నారు. జాన్ అబ్రహం కూడా తాను సినిమా రంగంలో పని చేసినప్పుడు రూ.550తో ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. 2003లో తన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాలో రూ.550 మాత్రమే ఉందని, తన నెల జీతం రూ.4,800 అని చెప్పాడు. తన సొంత నిబంధనలపై ముందుకు సాగడం.. సొంత నిబంధనలకు అనుగుణంగా జీవించడమే తనకు ముఖ్యమని తెలిపాడు. తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, తాను ఎవరికీ మిత్రుడని, శత్రువు కాదని నటుడు అన్నారు.

ఇవి కూడా చదవండి

తాను సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని అన్నారు. తన వద్ద ఎక్కువ బట్టలు లేవని, అతను సాధారణంగా చెప్పులు ధరిస్తానని, పికప్ ట్రక్ నడుపుతాడని చెప్పాడు. తన తల్లిదండ్రుల కోసం ఓ కారు తీసుకున్నానని.. కానీ వారి ఇప్పటికీ బస్సు, ఆటో రిక్షాలో ప్రయాణిస్తారని అన్నారు. తాను ఎప్పుడూ మధ్యతరగతి వ్యక్తిగానే ఉండాలని కోరుకుంటానని, తన విలువలను మరచిపోనని అన్నారు. గరం మసాలా, న్యూయార్క్, ధూమ్ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హౌస్‌ఫుల్ 5, రఖ్, టెహ్రాన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !