Actress Ramya: నాకు కోటి.. వాళ్లకు రూ. 5 కోట్లు.. సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్..
సినిమా నటులకు ఇచ్చేంత జీతం నటీమణులకు ఉండదు. దీని గురించి బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పుడు నటి రమ్య కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తన సొంత కెరీర్ నుండి ఉదాహరణలు ఇస్తూ చర్చకు దారితీసిన రమ్య, నటులతో పోలిస్తే హీరోయిన్లకు కు చాలా తక్కువ పారితోషికం ఇస్తారని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో నటీమణులకు నటులతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోనూ ఈ చర్చ నడుస్తుంది. ఇప్పటికే తమకు వచ్చే పారితోషికంపై హీరోయిన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరోలతో తమకు సమానంగా పారితోషికం ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చారు. తాజాగా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ రమ్య సైతం సంచలన కామెంట్స్ చేసింది. తన సొంత ఉదాహరణను ఉపయోగించి చిత్రపరిశ్రమలో వేతన అసమానత గురించి మాట్లాడింది.
రమ్య మాట్లాడుతూ.. ‘నాతో నటించిన కొంతమంది నేడు సూపర్ స్టార్లు. నేను మొదట్లో నాకంటే తక్కువ పారితోషికం తీసుకునే నటులతో పనిచేసినప్పుడు, ఆ సినిమా హిట్ అయిన వెంటనే, వారు తదుపరి చిత్రానికి నాకంటే 5 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. నటుడిగా వారికి 5 కోట్ల జీతం ఉంటే, నాకు 1 కోటి వచ్చేది. మనం వాళ్ళలాగే అదే పని చేసినప్పుడు మనకు తక్కువ జీతం వస్తుంది, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది ఎందుకు?
సినీరంగంలో చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఎవరూ వాటిని చెప్పడానికి ధైర్యం చేయరు ” అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందిస్తున్నారు. కానీ అది మహిళా ప్రధాన చిత్రంలా అనిపించదు. విద్యా బాలన్ చాలా ప్రతిభావంతులైన నటి, కానీ ఆమె దక్షిణ భారతదేశంలో పెద్దగా గుర్తింపు పొందలేదు. నటీమణులు ఒక సినిమా తర్వాత మరొక సినిమా హిట్ ఇవ్వరు, అంటే వారికి నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. మనం ఒక సినిమా హిట్ చేస్తే, 10 ప్రాజెక్టులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








