- Telugu News Photo Gallery Cinema photos Actress Rukshar Dhillon Serious For Taking Photos Uncomfortably In Dilruba Movie Trailer Launch Event
Rukshar Dhillon: వద్దని చెప్పినా అలా ఫోటోస్ తీస్తున్నారు.. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ అసహనం..
క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. మార్చి 14న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.
Updated on: Mar 06, 2025 | 8:48 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ జంటగా నటిస్తున్న సినిమా దిల్ రుబా. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పాటలు, టీజర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. హీరోయిన్ రుక్సార్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

స్టేజ్ మీద ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఫోటోస్ తీయొద్దు. ఇబ్బందిగా ఉందని చెప్పినా కొంతమంది మీడియా వాళ్లు ఫోటోస్ తీస్తున్నారంటూ చెప్పుకొచ్చింది రుక్సర్. గౌరవంగా చెప్పినా కూడా వినడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

రుక్సర్ మాట్లాడుతూ.. "నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంది.. ఇక్కడ ప్రేక్షకులలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.. మనం జనరల్ గా ఫోటోస్ తీసుకుంటాం కదా.. మీరు కూడా ఎవరివైనా ఫోటోస్ తీస్తారు.

కానీ కాస్త ఇబ్బందిగా ఉంది అని చెబితే ఎవరిదైనా ఫోటో తీస్తారా.. లేదా మీరు ఎప్పుడైనా అన్ కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఫోటో తీస్తే ఊరుకుంటారా.. ? అయినా నేను కూడా చాలా ప్రేమగా, గౌరవంగా చెప్పాను. ఇది కొంచం ఇబ్బందిగా ఉంది.. ఫోటోస్ తీయొద్దని..

అలా చెప్పడం తప్పా.. ? కాదు కదా.. స్టేజ్ మీద ఇప్పటివరకు ఏం జరిగింది మీరు చూశారు కదా.. మొదటి నుంచి ఫోటోస్ తీస్తున్నప్పుడు ఏమైంది చూశారు. కదా.. ఎవరి పేర్లు చెప్పను.. కానీ ఎవరికి అర్థమవ్వాల్లో వాళ్లకు అర్థమవుతుంది. గౌరవంగా చెప్పినా ఇప్పటికీ ఏం జరుగుతుందో మీరు చూశారు అంటూ సీరియస్ అయ్యింది.




