AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్

హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవలే రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. స్టార్ హీరోలతో నటించి మెప్పించింది మాళవిక.

కొంచమైనా బుద్దుందా.. ఇలాంటివేనా అడిగేది..? ఇచ్చిపడేసిన ప్రభాస్ హీరోయిన్
Malavika Mohanan
Rajeev Rayala
|

Updated on: May 17, 2026 | 7:36 AM

Share

అందాల భామ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. మొన్నటివరకు తమిళ్ సినిమాల్లో అలరించిన ఈ చిన్నది ఇటీవలే తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది మాళవికా మోహనన్. అంతే కాదు అక్కడ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసి ప్రేక్షకులు ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఈ అమ్మడు ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. కాగా ఈ అమ్మడు ఇటీవలే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది మాళవిక.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

భారీ అంచనాల మధ్య విడుదలైన రాజా సాబ్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ తమిళ్ లో మాత్రం ఛాన్స్ లు అందుకుంటూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ మీడియా నుంచి మాళవికామోహన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా అక్కడ జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కొందరు మీడియా ప్రతినిధులు ఆమెను ఇబ్బందిపెట్టేలా ప్రశ్నలు అడిగారు. దాంతో ఆమె ఫైర్ అయ్యింది. మీ రేటింగ్స్ కోసం ఇంత నీచంగా మాట్లాడాలా అంటూ నిప్పులుచెరిగింది మాళవికామోహనన్.. అసలు ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

ఇటీవల కోలీవుడ్ లో ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యింది మాళవిక. ఈ ప్రెస్ మీట్ లో అసందర్భంగా తమిళనాడు సీఎం , నటుడు విజయ్ గురించి కొందరు ప్రశ్నలు అడిగారు. విజయ్‌తో రిలేషన్‌పై కొందరు పిచ్చి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాళవిక సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ” ఇటీవల నేను ఓ పాల్గొన్న ఓ ప్రెస్ మీట్ లో కోలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలు చాలా ఇబ్బందిపెట్టాయి. కేవలం రేటింగులు, సెన్సేషన్ కోసమే అన్నట్టుగా వారు అడిగిన కొన్ని ప్రశ్నలు చాలా అసభ్యకరంగా, అసందర్భంగా ఉన్నాయి. ప్రెస్ మీట్, లేదా ఇంటర్వ్యూల్లో మీడియా ప్రతినిధులు కాస్త హుందాగా, గౌరవప్రదంగా నడుచుకోవాలని చెప్పుకొచ్చింది. అలాగే విజయ్ నాకు ఏడు సంవత్సరాలుగా బాగా తెలుసు. ఒక వ్యక్తిగా, నటుడిగా ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఆయన ఈరోజు రియల్ లైఫ్‌ హీరో అయ్యారు. ఆయన ఎదుగుదల, ఆయన సాగించిన ప్రయాణం నిజంగా అద్భుతం. అలాంటి వ్యక్తిని నా స్నేహితుడిగా చెప్పుకోవడానికి నేనెప్పుడూ గర్వపడతాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది మాళవిక మోహనన్.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us