AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

చాలా మంది అందాల హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. అమ్మ , అత్త, వదిన పాత్రలతో మెప్పిస్తున్నారు. కొంతమంది మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు.

15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 16, 2026 | 9:40 PM

Share

అందాల భామ మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తేవారు. తెలుగులో 15 ఏళ్ల వయస్సులోనే బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర తారలతో ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సహా 20కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే తెలుగు కంటే కన్నడ చిత్రసీమలో ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ లభించింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఆమెను హేమమాలిని ఆఫ్ కన్నడ సినిమా అని అభివర్ణించారు. కన్నడ అగ్ర హీరో సుదీప్, మాలశ్రీ చివరి హీరోయిన్ సూపర్ స్టార్ అని పేర్కొన్నారు. తెలుగులో విజయశాంతిలాగే కన్నడలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె ఒక కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.  మాలశ్రీ 1973 ఆగస్టు 10న భీమవరంకు చెందిన చంద్రలేఖ, పంజాబ్‌కు చెందిన పాండే దంపతులకు జన్మించారు. ఆమె కడుపులో ఉండగానే తల్లిదండ్రులు విడిపోవడంతో, మాలశ్రీని ఆమె పెద్దమ్మ పెంచారు. పెద్దమ్మ, పెద్దనాన్నలను అమ్మానాన్న అని పిలిచిన మాలశ్రీ, తన సొంత తల్లిని పిన్ని అనే పిలిచేవారట. ఆమెకు ఒక అక్క, అన్నయ్య, చెల్లి (నటి శుభశ్రీ) ఉన్నారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

బాలనటిగా నాలుగు నెలల వయస్సులోనే మహానటి సావిత్రి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత దాదాపు 35 సినిమాల్లో బాలనటిగా నటించారు. బాలనటిగా ఆమె అసలు పేరు శ్రీదుర్గను వాడేవారు. బాలయ్యబాబుతో రాము రాముడు భీముడు, నాగార్జునతో చినబాబు, వెంకటేష్‌తో వారసుడొచ్చాడు వంటి తెలుగు చిత్రాల్లోనూ బాలనటిగా నటించారు. మాలశ్రీకి హీరోయిన్‌గా తొలి అవకాశం కన్నడ చిత్రసీమ నుండే వచ్చింది. 1989లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సొంత బ్యానర్‌లో, ఆయన తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ హీరోగా నటించిన నంజుండి కళ్యాణ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 సంవత్సరాలు. ఈ సినిమా కర్ణాటకలో 535 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం పార్వతమ్మ గారు శ్రీదుర్గ పేరును మాలశ్రీగా మార్చారు. ఆమె నటించిన తొలి సినిమాతోనే కన్నడనాట ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత రాఘవేంద్ర రాజ్ కుమార్‌తో గజపతి గర్వభంగ, శివరాజ్ కుమార్‌తో తన సొంత బ్యానర్‌లో నటించిన చిత్రాలు కూడా ఘన విజయాలు సాధించాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

నటిగా కొనసాగుతూనే డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంబరీష్‌తో నటించిన రాణి మహారాణి చిత్రంలో చేసిన ఫైట్స్ కు మంచి స్పందన లభించగా, హృదయ హాడితూ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1991లో వచ్చిన రామాచారి (తెలుగులో చంటి రీమేక్) కన్నడ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్పీ భార్గవి చిత్రంతో ఆమెకు యాక్షన్ క్వీన్ అనే బిరుదు వచ్చింది. కాగా తవరుమనే ఒడుగరే చిత్రంలో హీరో సునీల్‌తో జంటగా నటించిన మాలశ్రీ, అతనితో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, 1994 జూలై 24న హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో సునీల్ మరణించడం మాలశ్రీ జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆమె ఎంతగానో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినా, ధైర్యంగా ముందుకు సాగారు. 1992లో ఒకే సంవత్సరంలో 20 సినిమాల్లో నటించి, రాజ్ కుమార్ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. 1990లో తెలుగులో విడుదలైన ప్రేమ ఖైదీ మాలశ్రీ కెరీర్‌కు ఒక మలుపు. నీలిమ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ అయింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. హరీష్‌తో పాటు సుమన్ తో ఆమె కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి.  ఒకే సంవత్సరంలో 14 తెలుగు సినిమాల్లో నటించారు. టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ఆమెకు నిర్మాత రాముతో పరిచయం ఏర్పడింది. నిర్మాత రామును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మాలాశ్రీ.   2021 ఏప్రిల్ లో ఆమె భర్త రాము కరోనా కారణంగా మరణించారు. దాదాపు 30 కన్నడ చిత్రాలను నిర్మించిన రాము మరణంతో మాలశ్రీ ఒంటరిగా మారారు. పిల్లల కోసం ధైర్యం తెచ్చుకుని, ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి సినిమాల్లో నటిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఆమె కుమార్తె ఆరాధన కాటేరా సినిమాతో కన్నడ చిత్రసీమలోకి ప్రవేశించి ఉత్తమ తొలిచిత్ర హీరోయిన్‌గా సైమా అవార్డును అందుకున్నారు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us