AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: మంచి మనసు చాటుకున్న సీఎం విజయ్.. హాస్యనటుడి కుటుంబానికి సాయం

ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నటుడు విజయ్. మొన్నటివరకు స్టార్ హీరోగా రాణించిన విజయ్.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ భారీ విజయాన్ని అందుకున్నారు . తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు .

CM Vijay: మంచి మనసు చాటుకున్న సీఎం విజయ్.. హాస్యనటుడి కుటుంబానికి సాయం
Cm Vijay
Rajeev Rayala
|

Updated on: May 16, 2026 | 9:18 PM

Share

దళపతి విజయ్ సినిమాల్లో తిరుగులేని హీరోగా రాణించి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగారు. తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ఎన్నికల్లోనే తరుగులేని విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఘనవిజయం సాధించారు. దాంతో విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సామాన్యులకు సేవ చేసే పనిలో పడ్డారు. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గుడి, బడి, బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం దుకాణాలను తీసివేయాలని ఆదేశించారు. కాగా తాజాగా సీఎం విజయ్ మంచి మనసు చాటుకున్నారు. ఓ కమెడియన్ కు ఆయన సాయం అందించారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

హాస్యనటుడు ముత్తుకలై ముఖ్యమంత్రి విజయ్ సహాయం అందించారని తెలుస్తుంది. కమెడియన్ ముత్తుకలై ఓ వీడియో ద్వారా ఇటీవలే తన భార్యకు సర్జరీ జరిగిందని ఆ తర్వాత తన భార్య మాలతికి ఊపిరితిత్తులు, ఇతర చోట్ల సమస్యలు తలెత్తాయని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తన భార్యకు మెరుగైన వైద్య చికిత్స కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సిఫార్సు చేయాలని ఆయన ఓ వీడియోలో రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ వీడియో సీఎం విజయ్ కు చేరింది. దాంతో ఆయనకు సాయం అందించారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ముత్తుకలై సాయం కోసం రిక్వెస్ట్ చేసిన తర్వాత, విజయ్ మంత్రి ఆదావ్ అర్జునతో ఆ హాస్యనటుడితో, అతని కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడించి, మాలతి ఆరోగ్యం గురించి ఆరా తీశారని తెలుస్తుంది. మంత్రి రాజ్ మోహన్‌ను ఆసుపత్రికి పంపి, ఆమెకు ఉన్నత వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు సీఎం విజయ్ ఆదేశించారు. కాగా ముత్తుకలై కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. కమెడియన్ కు విజయ్ సాయం చేయడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల