Akshay and Agri scam: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులో మరో ట్విస్ట్.. విచారణపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ హైకోర్టు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులో మరో ట్విస్ట్. దీనిపై సుదీర్ఘ కాలం పాటు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు (TS HighCourt) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది .
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులో మరో ట్విస్ట్. దీనిపై సుదీర్ఘ కాలం పాటు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు (TS HighCourt) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది . విచారణను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశచూపి, భారీగా డబ్బులు వసూలు చేసి జనాన్ని నిలువునా ముంచాయి అగ్రి గోల్డ్ సంస్థ, అక్షయ గోల్డ్ సంస్థలు. వీటి దోపిడీకి గురై వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నారు. డిపాజిట్ చేసిన సోమ్మును తిరిగి చెల్లించాలని బాధితులు గత కొన్నేళ్లుగా అవిశ్రాంత పోరాటాలు చేస్తున్నారు. దీంతో సమస్య న్యాయస్థానాల వరకు వెళ్లింది. తాజాగా అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో (Akshay and Agri scam cases) కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు (Eluru) కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను తిరస్కరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం. అటు వేలం ద్వారా వచ్చిన 50 కోట్ల రూపాయలను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు సూచించింది.
కాగా ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని స్పష్టం చేసింది తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం. కాగా అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ సంస్థలు ఆరు రాష్ట్రాల్లోని 32 లక్షల మంది నుంచి 36 వేల 380 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో ఏపీలోని అనంతపురం, కర్నూలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కడప, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అటు కర్ణాటకలోని యాదగిర్, బెంగుళూరు, కోలార్, మాండ్యా జిల్లాల్లోని ఆస్తులను అటాచ్ చేసింది. ఒడిశాలోని ఖుర్ధా, తమిళనాడులోని కృష్ణగిరి, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లోని ఆస్తులను కూడా జప్తు చేసింది ఈడీ.
Also Read:Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..
Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..