Trainee Aircraft Crash: నల్గొండ జిల్లాలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి కారణమేంటి? ఎవరు బాధ్యులు?
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. విద్యుత్ స్తంభంపై ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలడంతో పైలెట్, ట్రైనీ పైలెట్ ప్రాణాలు కోల్పోయారు.
Nalgonda Aircraft Crash News: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. విద్యుత్ స్తంభంపై ఎయిర్‌క్రాఫ్ట్ కూలడంతో ట్రైనీ పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ మహిమ ప్రమాదంలో మృతి చెందారు. కమర్షియల్ పైలెట్ ట్రైనీ కోర్సు చేస్తోంది మహిమ. మాచర్ల నుంచి టేకాఫ్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎలివేటర్ పనిచేయకపోవడంతో ప్రమాదానికి గురైంది. క్రాస్ కంట్రింగ్ సమయంలో ఎలివేటర్ పనిచేయ లేదు. దీంతో పెద్దవూర మండలం తుంగతుర్తిలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది.
అసలు.. ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థ వివాదాల కుప్పగా తేలుతోంది. ఏవియేషన్ సంస్థ నిర్లక్ష్యమే నల్గొండ ప్రమాదానికి కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లైటెక్ ఏవియేషన్ చుట్టూ చాలా రోజుల నుంచి వివాదాలు నడుస్తున్నాయి. గతంలో కూడా ఆ ఏవియేషన్ సంస్థపై ఫిర్యాదులున్నాయి. అంతా బాగుందని వాతావరణ నిపుణులు చెప్తున్నా.. ప్రమాదం ఎలా జరిగిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైలెట్ శిక్షణ ఇస్తున్న ప్లయ్‌టెక్ సంస్థ సరైన ప్రమాణాలు పాటించడం లేదని గతంలో ఈడీ , సీబీఐ , డీఆర్‌ఐ కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఫిర్యాదులపై రెండేళ్ల క్రితం DGCI విచారణ కూడా జరిపింది. ట్రయినింగ్ విషయంలో విద్యార్ధుల పేరంట్స్ నుంచి ఏవియేషన్ డైరెక్టర్‌గా ఫిర్యాదులు అందినట్టు ఆయనే స్వయంగా ధృవీకరిస్తున్నారు . దీనిపై విచారణ జరిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ డైరెక్టర్ సిద్ధమవుతున్నారు. వాళ్లు నడిపే శిక్షణా విమానాలకు సరైన ప్రమాణాలు పాటించరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఫ్లైటెక్ ఏవియేషన్‌పై ఏవియేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా 152 మోడల్ టూ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. నాగార్జున సాగర్ ఎయిర్ బేస్ నుంచే ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఫ్లైటెక్ ఏవియేషన్.
ఆరోపణలు అవాస్తవం.. టీవీ9తో ఫ్లై టెక్ ఏవియేషన్ సీఈవో
కాగా తమ సంస్థ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలను ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్ తోసిపుచ్చింది. ఆ సంస్థ సీఈవో మమత టీవీ9తో మాట్లాడుతూ.. తమ సంస్థలో సరైన నిర్వహణ ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఛాపర్ క్రాష్ లో మృతి చెందిన పైలెట్ మహిమ నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌లో ఉన్న ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్ లో పైలెట్‌గా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఆరు మాసాలుగా మహిమ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కరినే ఛాపర్‌లో పంపడం శిక్షణలో భాగమేనన్నారు. పైలెట్ ఫర్పెక్ట్ అయిన తర్వాతే ఒంటరిగా పంపిస్తామని వివరించారు. ఈ రోజు ఉదయం 10.25 గం.లకు ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయినట్లు తెలిపారు. 11 గం.ల ప్రాంతంలో ఛాపర్ ప్రమాదానికి గురైయ్యిందన్నారు. ప్రమాదానికి కారణలు తెలియాల్సి ఉందన్నారు.
Also Read..
Bheemla Nayak : ఇదెక్కడి అరాచకం రా మామ..! లాలా సాంగ్‌కు థియేటర్‌లో తమన్ మాస్ డ్యాన్స్..
Bigg Boss Non-Stop: బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వీరే..