Sircilla: అపారెల్ పార్కులో టెక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీ.. కొత్తగా ఎంత మందికి ఉపాధి లభించనుందంటే..
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా సిరిసిల్లలో అపారల్ పార్కు ( Sircilla apparel park)లో మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు బెంగళూరుకు చెందిన జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూప్ ముందుకు వచ్చింది.
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా సిరిసిల్లలో అపారల్ పార్కు ( Sircilla apparel park)లో మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు బెంగళూరుకు చెందిన జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో టెక్స్ పోర్టు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ చేనేత, జౌళి కమిషనర్ శైలజా రామయ్యర్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర గోయెంకా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కాగా సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అపారల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఈ పార్క్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మొత్తం 63 ఎకరాల సువిశాల పార్క్‌ను సుమారు రూ.175 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. వస్త్రాల ఉత్పత్తితోపాటు ఎగుమతులకు అనుగుణంగా బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా ఈ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
రూ. 60 కోట్లతో.. ఇందులో భాగంగానే అపారల్ పార్కులో 7.42 ఎకరాల స్థలంలో టెక్స్‌పోర్ట్ కంపెనీ తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా సుమారు 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. పరోక్షంగా మరికొందరికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కాగా సుమారు 60 కోట్లతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి, వృత్తి నైపుణ్యం పెంపుదలకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు మంత్రి కేటీఆర్. టెక్స్‌పోర్ట్ కంపెనీ పెట్టే పెట్టుబడితో మరో మూడేళ్లలో 2 వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారాయన. కంపెనీ సాధ్యమైనంత త్వరగా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
The Govt of Telangana and Texport Industries Private Ltd (TIPL), entered into a Memorandum of Understanding (MoU) in the presence of Minister @KTRTRS today. pic.twitter.com/uqtjwbDzuc
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2022
Also Read: Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..
Smart Phone: స్కూల్స్‌కు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్.. మంటల్లో వేసిన టీచర్ ఎక్కడంటే..