Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?

Big News Big Debate: ప్రపంచమంతా ముక్తకంఠంతో వద్దని వారించినా యుద్ధానికే సై అంది రష్యా. అయితే సైనికపరంగా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్న ప్రపంచ దేశాలు ఫైనాన్షియల్‌ వార్‌ ప్రకటిస్తున్నాయి.

Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Big News Big Debate
Follow us

|

Updated on: Feb 25, 2022 | 10:43 PM

Big News Big Debate: ప్రపంచమంతా ముక్తకంఠంతో వద్దని వారించినా యుద్ధానికే సై అంది రష్యా. అయితే సైనికపరంగా చర్యలు తీసుకోవడానికి భయపడుతున్న ప్రపంచ దేశాలు ఫైనాన్షియల్‌ వార్‌ ప్రకటిస్తున్నాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను వదులుకోవడానికి సిద్దమవుతున్నాయి అగ్రదేశాలు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకూ ఆంక్షలు విధించాయి అగ్రదేశాలు. ఊహించని యుద్ధంతో జరగబోయే నష్టాన్ని అంచనా వేయడం కష్టమంటున్నారు నిపుణులు. రెండోరోజూ ఉక్రెయిన్ నగరాల్లో బాంబుల వర్షం కురుస్తోంది. మరికొద్ది గంటల్లోనే ఉక్రెయిన్‌ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్లే అవకాశముంది. మరోపక్క ప్రపంచ దేశాలన్నీ వద్దని వారించినా పెడచెవిన పెట్టి యుద్ధానికే మొగ్గుచూపిన రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడుతున్నాయి అగ్రరాజ్యాలు. అమెరికా, యూకే, యూరోప్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి. వ్యాపార – వాణిజ్యం వదులుకుంటున్నాయి. యూరప్‌ సుస్థిరతకే ప్రమాదంగా మారిన రష్యా సైనిక చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్న యురోపియన్‌ యూనియన్‌ ఆంక్షలపై డ్రాఫ్ట్‌ సిద్దం చేసింది. త్వరలోనే ఆమోదించనుంది. అంతకంటే ముందే జర్మనీ తన గ్యాస్‌ ప్రాజెక్టును రద్దు చేసుకుంది. యూరోప్‌ దేశాలకు ఉండే ప్రయార్టీ వీసాలు రద్దు చేశాయి. రష్యా ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంగా అతిపెద్ద బ్యాంకులపై నిషేధం విధించింది అమెరికా. 30 సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశం అవుతున్న జె బైడెన్‌ కూడా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

అటు యుద్ధం… ఇటు ఆంక్షల మధ్య తలెత్తే ఆర్ధిక పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో గుబులు మొదలైంది. రష్యాకు ఎగుమతులు చేసి ఆర్ధికంగా లాభపడే దేశాలకు నష్టం కాగా… అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు రాకపోతే తలేత్తే సంక్షోభం కూడా చాలా దేశాలను ప్రమాదం ముంగిట నిలబెట్టింది. భారత్‌లో ఫార్మా ఎగుమతులపై ప్రభావం పడుతుండగా.. ఆయిల్‌ దిగుమతులు తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ ఉత్పత్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో రష్యా ఒకటి. ప్రస్తుతం ఆంక్షలు విధిస్తే ఆటో సహా స్టీల్‌ రంగాలపై తీవ్ర ప్రబావం పడుతుంది. ఇక ఆఫ్రికా దేశాలకు గోధుముల కొరత తప్పదంటున్నారు. యుద్ధం వల్ల జరిగే నష్టమే కాదు. అటు ఆంక్షలతో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తప్పదంటున్నారు నిపుణులు.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..

Also Read:UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. ఓటర్లకు అఖిలేష్ ఇచ్చిన ఆ హామీ గేమ్ ఛేంజర్ కానుందా?

Shaakuntalam: మరోసారి మాయ చేయడానికి సిద్దమైన గుణశేఖర్.. హిస్టారికల్ వండర్ సామ్ శాకుంతలం

Smart Phone: స్కూల్స్‌కు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్.. మంటల్లో వేసిన టీచర్ ఎక్కడంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ