Smart Phone: స్కూల్స్‌కు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్.. మంటల్లో వేసిన టీచర్ ఎక్కడంటే..

Indonesia:పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులు(Teachers). తల్లిదండ్రుల(Parents) తర్వాత పిల్లలు ఎక్కువ సమయం గడిపేది టీచర్ల దగ్గరే. తమ వద్ద విద్యనభ్యసించే విద్యార్థులు(Students) క్రమశిక్షణ కలిగి..

Smart Phone: స్కూల్స్‌కు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్.. మంటల్లో వేసిన టీచర్ ఎక్కడంటే..
Indonesian School Teachers
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2022 | 9:40 PM

Indonesia:పిల్లల భవిష్యత్ ను అందంగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులు(Teachers). తల్లిదండ్రుల(Parents) తర్వాత పిల్లలు ఎక్కువ సమయం గడిపేది టీచర్ల దగ్గరే. తమ వద్ద విద్యనభ్యసించే విద్యార్థులు(Students) క్రమశిక్షణ కలిగి ఉండాలని.. ఎల్లప్పుడూ సన్మార్గంలో నడుచుకోవాలని టీచర్లు కోరుకుంటారు. అందుకనే క్రమ శిక్షణ కోసం వివిధ రకాల పద్ధతుల్లో శిక్షలను విధిస్తారు. మరీ ఎన్ని సార్లు చెప్పినా మాట వినని స్టూడెంట్స్ విషయంలో కొంతమంది టీచర్స్ కఠినంగా వ్యవహరిస్తుంటారు.ఒకొక్కసారి వివాదాస్పదంగా కూడా మారుతుంటాయి.. తాజాగా విద్యార్థులు తమ మాట వినడం లేదని టీచర్ సెల్ ఫోన్ల(smartphones)ను మంటల్లో విసిరేసింది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇండోనేషియాలో ఓ బోర్డింగ్ స్కూళ్లో స్టూడెంట్స్  ఫోన్ లు తీసుకరావద్దని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ స్టూడెంట్స్ వినకుండా సెల్ ఫోన్లను స్కూల్స్ కు తీసుకుని వస్తున్నారు.  ఇది చూసిన టీచర్స్ కు కోపం వచ్చింది. తాము ఎన్ని సార్లు చెప్పినా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు తీసుకొస్తున్నారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కోపంతో విద్యార్థుల వద్ద ఉన్న ఫోన్లను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం ఆ ఫోన్లను స్టూడెంట్స్ కు ఇవ్వకుండా  ఓ  కుండీని ఏర్పాటు చేసి మంటను ఏర్పాటు చేశారు. అనంతరం ఆ మంటల్లో స్టూడెంట్స్ చూస్తుండగానే .. ఒకొక్క సెల్ ఫోన్ ను ఆ మంటల్లోకి విసిరేశారు. తమ సెల్ ఫోన్లను మంటల్లోకి విసిరి వేస్తుంటే.. విద్యార్థులు వద్దు మేడం.. అని వేడుకున్నారు. అయినప్పటికీ టీచర్స్ విద్యార్థుల విన్నపాన్ని పట్టించుకోలేదు.. ఒకొక్క సెల్ ను వారికీ చూపిస్తూ.. మరీ మంటల్లోకి విసిరేశారు. ఈ వీడియో ఎవరో చిత్రీకరించి.. fakta.indo ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు. అయితే ఈ వీడియో టీచర్స్ తీరుపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది పిల్లలు మరీ సెల్ ఫోన్లకు అడిక్ట్ ఐపోతున్నారు.. టీచర్స్ చేసింది తప్పుకాదు అని సమర్దిస్తుంటే.. మరికొందరు.. పిల్లలలు అంతగా వేడుకుంటున్నా అలా సెల్ ఫోన్లు మంటల్లో వేయడం కరెక్జ్ కాదు అని అంటున్నారు.

Also Read:

యుద్ధ క్షేత్రంలో చిక్కకున్న భారతీయలు.. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం..