Shaakuntalam: మరోసారి మాయ చేయడానికి సిద్దమైన గుణశేఖర్.. హిస్టారికల్ వండర్‌‌‌‌గా సామ్ శాకుంతలం

యూ ట‌ర్న్‌.. ఓ బేబి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన స్టార్ హీరోయిన్ స‌మంత నటిస్తన్న లేటెస్ట్ మూవీ శాకుంతలం.

Shaakuntalam: మరోసారి మాయ చేయడానికి సిద్దమైన గుణశేఖర్.. హిస్టారికల్ వండర్‌‌‌‌గా సామ్ శాకుంతలం
Samantha, Shakunthalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 26, 2022 | 3:08 PM

Shaakuntalam: యూ ట‌ర్న్‌.. ఓ బేబి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన స్టార్ హీరోయిన్ స‌మంత నటిస్తన్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండర్ ‘శాకుంత‌లం’. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  రాకుమారిగా ఎంతో అందంగా కనిపించింది సామ్. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రానటువంటి అందమైన, అద్భుతమైన, చూడచక్కటి దృశ్య కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ ఆవిష్కరిస్తున్నారు. ఓ డైరెక్టర్‌గా, మేకర్‌గా తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కించిన వారిలో గుణ శేఖర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించడం ఆయన అలవాటు. ఆయన సినిమాలను, వాటిని ఆయన తెరకెక్కించిన విధానం చూస్తే ఆ విషయమ మనకు అవగతం అవుతుంది. ‘శాకుంతలం’ చిత్రాన్ని కూడా ఇది వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ప్రేమ కావ్యంగా ఆయన మలుస్తున్నారు.

సమంత లుక్‌ను గ‌మ‌నిస్తే.. ముని క‌న్య పాత్ర‌లో ఆశ్ర‌మంలో కూర్చుని ఉన్న స‌మంత‌, ఆమె నెమ‌ళ్లు, జింక‌లు, హంస‌లు ఇత‌ర వన్య ప్రాణులు నిలుచుని ఉన్నాయి. ఆమె దేని కోస‌మే ఎదురు చూస్తోంది. ఫ‌స్ట్ లుక్ చాలా కూల్‌గా అనిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ చాలా పొయెటిక్‌గా మనసుకు హత్తుకునేలా ఉంది. మేకింగ్‌లో అన్ కాంప్రమైజ్డ్‌గా సినిమాను రూపొందించే గుణ టీమ్ వర్క్స్ రుద్రమదేవి వంటి హిస్టారికల్ వండర్ తర్వాత.. దాన్ని మించేలా మరో అద్భుతాన్ని, పెద్ద కాన్వాస్‌ గీసిన అందమైన పెయింటింగ్‌ను చూస్తే మనసుకు ఎంత సంతోషం కలుగుతుందో అలాంటి భావాన్ని మన మనసులకు కలిగించేలా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందిస్తోంది గుణ టీమ్ వర్క్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

Poonam Kaur: పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్.. స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ రివ్యూ చెప్పేసిందిగా..

Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..