Bheemla Nayak: ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దగ్గుబాటి రానా(Rana) హీరోలుగా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దగ్గుబాటి రానా(Rana) హీరోలుగా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ (Telangana ) రాష్ట్రాలతో పాటు.. రెస్టాఫ్ ఇండియా సుమారు మూడు వేల థియేటర్లో రిలీజయింది. అయితే కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న థియేటర్ యజమానులకు ఈ సినిమా రిలీజ్ కావడం మంచి సంతోషన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణాలో ఓ వైపు నూటికి నూరు శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ తో పాటు ఐదో షో ప్రదర్శన, టికెట్ ధర పెంపుదలలో వెసులు బాటు ఇవన్నీ కలిసి సినీ పరిశ్రమతో పాటు, ఎగ్జిబిటర్స్ సంతోషంగా ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులున్నాయి. ఏపీలో భీమ్లా నాయక్ రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం నిర్వహించే బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు.. సినిమా టికెట్ల తగ్గింపు ధరలకే మూవీ ప్రదర్శించాలని ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జరీ చేసింది. దీంతో ఏపీలో పలు చోట్ల థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదలకి ముందే గురువారమే ఏపీ వ్యాప్తంగా థియేటర్లకు ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసింది. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన ధరల కంటే సినిమా టికెట్ ధరలను పెంచినా కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తూ.. అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే ఇప్పటికే కరోనా తో థియేటర్స్ యజమాన్యం విపరీతమైన నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో .. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీరుతో మరింత నష్టపోతున్నామంటూ థియేటర్స్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు ప్రభుత్వం చెప్పిన ధరలకు సినీ ప్రదర్శిస్తే.. తమకు కనీసం కరెంట్ ఖర్చు కూడా రాదంటూ మరికొన్ని చోట్ల భీమ్లా నాయక్ ను తమ సినిమా హాల్ లో ప్రదర్శన లేదంటూ యాజమాన్యాలు థియేటర్ల వద్ద బోర్డులు పెట్టేశారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సొంత జిల్లా కృష్ణాజిల్లాలోనే పలు థియేటర్లలో ప్రదర్శన ఆగిపోయింది. విస్సన్నపేటలో టికెట్ ధర ప్రభుత్వ లెక్క ప్రకారం రూ.35 అమ్మాలి. ఈ రేటుకి ప్రదర్శన గిట్టుబాటు కాదని యాజమాన్యాలు తాము సినిమా ప్రదర్శించడం లేదంటూ బోర్డు పెట్టేశాయి.అనేక థియేటర్స్ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ థియేటర్ల ముందు రాస్తారోకు దిగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో అభిమానులు హుండీలు ఏర్పాటు చేశారు.
Also Read: