AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS.Viveka: బాత్ రూమ్ లో వివేకా మృతదేహం చూశా.. వై.ఎస్.ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో కీలక అంశాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP.Avinash Reddy) పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి.. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16న సీబీఐకి ఆయన తన వాంగ్మూలాన్ని...

YS.Viveka: బాత్ రూమ్ లో వివేకా మృతదేహం చూశా.. వై.ఎస్.ప్రతాప్ రెడ్డి వాంగ్మూలంలో కీలక అంశాలు
Viveka
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 25, 2022 | 4:24 PM

Share

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP.Avinash Reddy) పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి.. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16న సీబీఐకి ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. వివేకా బెడ్, నేలపై రక్తపు మరకలు చూశానని, బెడ్‌రూమ్‌లో దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని సీబీఐ(CBI)కి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. బాత్‌రూమ్‌లో రక్తపు మరకల మధ్య వివేకా మృతదేహం ఉందన్నారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చెప్పారని, కానీ అది గుండెపోటుతో మృతి చెందినట్లు లేదని తాను గ్రహించానని వెల్లడించారు. పనిమనిషితో రక్తపు మరకలు శుభ్రం చేయిస్తుంటే అనుమానం వచ్చిందని, రక్తపు మరకలను శంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి శుభ్రం చేయించారని తెలిపారు. కడప ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకున్నా పర్లేదని వివేకా చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనను కాదంటే టికెట్‌ను షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని ఆయన కోరారన్నారు.

         వివేకానందరెడ్డి ఇంట్లోని బెడ్ రూంలోకి వెళ్ళి చూసేసరికి, అప్పటికే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా అక్కడ ఉన్నారు. బెడ్‌మీద, నేలపైన రక్తపు మరకలు ఉన్నాయి. బాత్ రూంలో వివేకా మృతదేహం కనిపించింది. అక్కడి పరిస్థితులను చూస్తే గుండెపోటు కాదని, ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అవినాశ్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి పని మనిషితో రక్తపు మరకలను శుభ్రం చేయించారు. సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ ప్రశ్నించినా వాళ్లు పట్టించుకోలేదు.                           – వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి

Also Read

Hyderabad: డిస్కౌంట్ ధరకు రాజీవ్ స్వగృహ ఇళ్ల అమ్మకం.. హెచ్‌ఎండీఏ కీలక ప్రకటన

స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గ‌డుపుతున్నారంటే..

భారీ ఎత్తున ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోయిన్లు..