భారీ ఎత్తున ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోయిన్లు..

Adavallu Meeku Joharlu: శర్వానంద్‌ (sharwanand), రష్మిక మందన్న (Rashmika) జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలోని..

భారీ ఎత్తున ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోయిన్లు..
Adavallu Meeku Joharlu
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 25, 2022 | 11:34 AM

Adavallu Meeku Joharlu: శర్వానంద్‌ (sharwanand), రష్మిక మందన్న (Rashmika) జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సినిమాలోని పాటలు, టీజర్‌లు ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశాయి. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 04న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ విషయంలో దృష్టి సారించిన సినిమా యూనిట్‌.. ప్రచారరంలో స్పీడ్‌ను పెంచింది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ వేడుకకు చిత్ర యూనిట్ భారీ తారగణాన్ని ఆహ్వానించింది. స్టార్‌ హీరోయిన్లు కీర్తి సురేష్‌, సాయి పల్లవి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్‌ కూడా ఈవెంట్‌కు రానున్నారు. సినిమా ట్రైలర్‌ను కీర్తి సురేష్‌, సాయి పల్లవి కలిసి లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈవెంట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి వంటి సీనియర్‌ హీరోయిన్‌లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమాలోని పాటలు మంచి బజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Ram Charan: రామ్ చరణ్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించనున్న స్టార్ హీరో..?

Adipurush : ఆదిపురుష్ సినిమా అలా ఉండబోతుందా..? ప్రభాస్‌తో బాలీవుడ్ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం చేయనున్నారా..?

Whatsapp status: కూతురి నిర్వాకం.. తల్లి ఉసురు తీసిన వాట్సాప్‌ స్టేటస్‌.. ఎటు పోతుందో సమాజం అంటూ నెటిజన్లు షాక్.. వీడియో..