Vijay Devarakonda: పాన్‌ ఇండియా చిత్రంగా విజయ్‌ – శివ సినిమా.? అందుకు ఇదే నిదర్శనమా..?

Vijay Devarakonda: అర్జున్‌ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్‌ దక్కించుకున్న విజయ్‌ అనతికాలంలోనే టాప్‌ హీరోల్లో ఒకరిగా...

Vijay Devarakonda: పాన్‌ ఇండియా చిత్రంగా విజయ్‌ - శివ సినిమా.? అందుకు ఇదే నిదర్శనమా..?
Vijay Devarakonda
Follow us

|

Updated on: Feb 25, 2022 | 10:48 AM

Vijay Devarakonda: అర్జున్‌ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్‌ దక్కించుకున్న విజయ్‌ అనతికాలంలోనే టాప్‌ హీరోల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు విజయ్‌. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో పాగా వేయాలని గట్టిగా ప్లాన్‌ చేస్తున్నారు విజయ్‌. అందుకు అనుగుణంగానే లైగర్‌ సినిమా కోసం విజయ్‌ ఎంతో శ్రమించారు. ఇప్పటికే అర్జున్‌ రెడ్డితో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్‌ లైగర్‌తో పాన్‌ ఇండియా హీరోగా మారనున్నారు. ఇదిలా ఉంటే విజయ్‌ తర్వాతి చిత్రం కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కనుందా అంటే చిత్ర యూనిట్‌ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే లైగర్‌ సినిమా తర్వాత విజయ్‌.. శివ నిర్వాణతో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వాణీ నటించనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలే విజయ్‌ తర్వాతి చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందన్న వార్తలు బలం చేకూరుస్తున్నాయి.

లైగర్‌తో బాలీవుడ్‌లో విజయ్‌కి వచ్చే క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకే శివ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చర్చ జరుగుతోంది. మరి విజయ్‌, శివల చిత్రం నిజంగానే బాలీవుడ్‌లోనూ విడుదలవుతుందా.? లేదో తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Ravi Teja: ‘రవితేజ చీప్ యాక్టర్’ డైరెక్టర్ భార్య స్టేట్‌మెంట్‌కు కారణం ఇదే.! సోషల్ మీడియాలో దుమారంగా మారిన ఇష్యూ..

Viral Video: వీళ్ళకి మానవత్వం ఉందా…! వీల్ చైర్​లో వచ్చిందని రెస్టారెంట్​లోకి రానివ్వలేదు.. వైరల్ వీడియో..

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ