Viral Video: వీళ్ళకి మానవత్వం ఉందా...! వీల్ చైర్​లో వచ్చిందని రెస్టారెంట్​లోకి రానివ్వలేదు.. వైరల్ వీడియో..

Viral Video: వీళ్ళకి మానవత్వం ఉందా…! వీల్ చైర్​లో వచ్చిందని రెస్టారెంట్​లోకి రానివ్వలేదు.. వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 25, 2022 | 8:41 AM

ఢిల్లీకి చెందిన సృష్టి పాండే ఓ దివ్యాంగురాలు. ఎక్కడికైనా వీల్ చైర్ లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఆమెది. చాలారోజుల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ఆమెను రెస్టారెంట్​కు తీసుకెళ్లింది. కానీ, వీల్ చైర్​తో లోపలికి వెళ్తే కస్టమర్లు డిస్ట్రబ్ అవుతారంటూ సిబ్బంది అడ్డుకున్నారు.


ఢిల్లీకి చెందిన సృష్టి పాండే ఓ దివ్యాంగురాలు. ఎక్కడికైనా వీల్ చైర్ లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఆమెది. చాలారోజుల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ఆమెను రెస్టారెంట్​కు తీసుకెళ్లింది. కానీ, వీల్ చైర్​తో లోపలికి వెళ్తే కస్టమర్లు డిస్ట్రబ్ అవుతారంటూ సిబ్బంది అడ్డుకున్నారు. గురుగ్రామ్ లోని రాస్తా రెస్టారెంట్​లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. తనకు జరిగిన ఈ అవమానంపై సృష్టి ట్వీట్ చేయడం.. అది వైరల్​ కావడంతో దిగొచ్చిన రెస్టారెంట్ ఓనర్​ గౌమతేశ్ సింగ్​.. ట్విట్టర్​లో సారీ చెప్పాడు. తన ఫ్రెండ్‌ సోదరుడు , రెస్టారెంట్ సిబ్బందిని రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసినా లోపలికి పోనివ్వలేదని, చలిలో ఆరుబయట కూర్చోబెట్టారని, అక్కడ జరిగిన మొత్తం సీన్​ను సృష్టి ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.ఆ తర్వాత ఓ మీడియా సంస్థ సృష్టితో లైవ్​లో మాట్లాడించింది. గౌమతేశ్​నూ లైన్లోకి తెచ్చింది. ఒక దివ్యాంగురాలిగా తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదని, ఆయన పబ్లిక్ గా తనకు క్షమాపణలు చెప్పాలని సృష్టి డిమాండ్ చేసింది. కానీ ఫోన్ నెంబర్ ఇస్తే పర్సనల్ గా ఫోన్ చేసి మాత్రమే సారీ చెప్తానని, ఇలా పబ్లిక్ గా చెప్పబోనంటూ గౌమతేశ్ లైన్ కట్ చేశాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..