Viral Video: స్టూడెంట్స్‌ను క్రమశిక్షణలో పెట్టాలంటే ఇంత కఠినంగా వ్యవహరించాలా?.. టీచర్లపై మండిపడుతున్న నెటిజన్లు..
ndonesia: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు టీచర్లు వివిధ రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. ఒక్కోసారి మాటవినని, దారికి రాని విద్యార్థుల కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటారు.
Indonesia: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు టీచర్లు వివిధ రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. ఒక్కోసారి మాటవినని, దారికి రాని విద్యార్థుల కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే విద్యార్థులు ఏం చేశారో తెలియదు గాని టీచర్లు వారి స్మార్ట్ ఫోన్ల (Smart phones) ను మంటల్లో విసిరేశారు. స్టూడెంట్స్ వద్దని వారిస్తున్నా పట్టించుకోకుండా వినకోకుండా ఫోన్లను నిలువునా తగలబెట్టేశారు. ఇండోనేషియా (Indonesia) లో ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లందరూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
సాధారణంగా పాఠశాలకు ఫోన్లను తీసుకురావద్దని విద్యా్ర్థులకు సూచిస్తుంటారు టీచర్లు. ఒకవేళ తీసుకొచ్చినా తరగతి గదుల్లో సైలెంట్‌లో పెట్టుకోమంటారు. అయితే ఇండోనేషియాల బోర్డింగ్ స్కూల్లో విద్యార్థులు ఎంత చెప్పినా స్మార్ట్ ఫోన్‌లు తీసుకువస్తున్నారని టీచర్లు కోపంతో మొబైల్స్‌ను వారి వద్ద నుంచి లాగేసుకున్నారు. వాటిని వారి ముందే మంటల్లో వేసి కాల్చేశారు. ‘ప్లీజ్ మేడం వద్దు’ అంటూ విద్యార్థులు అరుస్తున్నప్పటికీ టీచర్లు ఏ మాత్రం వినిపించుకోలేదు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. టీచర్లు చెప్పిన మాట విననందుకే అలా చేసి ఉంటారని కొందరు కామెంట్లు పెట్టగా.. ఒకరి ఆస్తి, వస్తువులను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదంటూ టీచర్లు చేసిన పనిపై మండిపడుతున్నారు.
View this post on Instagram
Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..