Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: 'రవితేజ చీప్ యాక్టర్' డైరెక్టర్ భార్య స్టేట్‌మెంట్‌కు కారణం ఇదే.! సోషల్ మీడియాలో దుమారంగా మారిన ఇష్యూ..

Ravi Teja: ‘రవితేజ చీప్ యాక్టర్’ డైరెక్టర్ భార్య స్టేట్‌మెంట్‌కు కారణం ఇదే.! సోషల్ మీడియాలో దుమారంగా మారిన ఇష్యూ..

Anil kumar poka

|

Updated on: Feb 25, 2022 | 9:16 AM

హీరో, డైరెక్టర్ మధ్య ఎక్కడ చెడింది? డైరెక్టర్ టాలెంట్‌పై హీరోకి నమ్మకం లేదా? హీరో క్యారెక్టర్ డైరెక్టర్‌కు నచ్చడం లేదా? ఇద్దరు కలిసి సినిమా తీశారు. అంతా అయ్యాక ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా..? ఇదే ఖిలాడీ ఇష్యూ.


హీరో, డైరెక్టర్ మధ్య ఎక్కడ చెడింది? డైరెక్టర్ టాలెంట్‌పై హీరోకి నమ్మకం లేదా? హీరో క్యారెక్టర్ డైరెక్టర్‌కు నచ్చడం లేదా? ఇద్దరు కలిసి సినిమా తీశారు. అంతా అయ్యాక ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా..? ఇదే ఖిలాడీ ఇష్యూ. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ…!క్రాక్‌ తరువాత రిలీజైన మాస్ మహారాజా రవితేజ సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ డైరెక్షన్లో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్‌ తో రన్‌ అవుతోంది. ఏదో ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లో హీరో చిన్న చిన్న విమర్శలు తప్ప అంతా సవ్యవంగా సక్రమంగా ఉందనే టాక్ కూడా వచ్చింది. కాని ఈక్రమంలోనే తాజాగా డైరెక్టర్ రమేశ్ వర్మ వైఫ్ రేఖా వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఈ సినిమా మేకింగ్‌లో డైరెక్టర్ హీరో మధ్య ఏదో జరిగిందనే విషయాన్ని బయట పెట్టింది.గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్‌ యాక్టర్‌ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు రేఖవర్మ. ఇక దీనిపైనే రవితేజ ఫ్యాన్స్ తాజాగా అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. అలా ఎలా అంటావ్ అంటూ ఆమెపై.. ఆమె భర్త డైరెక్టర్‌ రమేష్ వర్మపై విరుచుకుపడుతున్నారు. అయితే రవితేజ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..