Whatsapp status: కూతురి నిర్వాకం.. తల్లి ఉసురు తీసిన వాట్సాప్ స్టేటస్.. ఎటు పోతుందో సమాజం అంటూ నెటిజన్లు షాక్.. వీడియో..
సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోల కారణంగా మృతి చెందిన మహిళల గురించి విన్నాం. కానీ వాట్సాప్ స్టేటస్ కారణంగా నేరం జరిగిన సందర్భాల గురించి అరుదుగా విన్నాం. మహారాష్ట్రలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోల కారణంగా మృతి చెందిన మహిళల గురించి విన్నాం. కానీ వాట్సాప్ స్టేటస్ కారణంగా నేరం జరిగిన సందర్భాల గురించి అరుదుగా విన్నాం. మహారాష్ట్రలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలో ఓ కుటుంబం మరో కుటుంబం పై జరిపిన దాడిలో 48 ఏళ్ల తల్లి తీవ్రంగా గాయపడి మరణించింది. కుమార్తె ప్రీతి పెట్టిన వాట్సాప్ స్టేటస్ అందుకు ఆమె స్నేహితుడు 17 ఏళ్ల మైనర్ యువకుడి కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. నిజానికి ఆ వాట్సాప్ స్టేటస్‌తో ఆ మైనర్‌కి సంబంధం లేదు. కానీ ఆ యువకుడు ప్రీతి పెట్టిన వాట్సాప్ తనకు సంబంధించిందేనని భావించి తన కుటుంబంతో వెళ్ళి ప్రీతి ఇంటిపై దాడి చేశాడు. ఈ దాడిలో ప్రీతి తల్లి లీలావతి పక్కటెముకలకు తీవ్రంగా గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యువకుడి తల్లి, మరో ఇద్దరు కుట్టుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

