Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..

నో కామా.. నో ఫుల్ స్టాప్. ఇకపై నాన్ స్టాప్ ఎంటర్‏టైన్మెంట్.. ఇదే ఇప్పుడు ‏బిగ్‏బాస్ ఓటీటీ (Bigg Boss OTT) ట్యాగ్ లైన్. ఇకపై కేవలం గంట మాత్రమే కాకుండా.. 24 గంటలు వినోదాన్ని

Bigg Boss OTT Telugu: ‏బిగ్‏బాస్ కొత్తింటిని చూపించిన నాగార్జున.. ఇక గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ ప్రోమో రిలీజ్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2022 | 3:37 PM

నో కామా.. నో ఫుల్ స్టాప్. ఇకపై నాన్ స్టాప్ ఎంటర్‏టైన్మెంట్.. ఇదే ఇప్పుడు ‏బిగ్‏బాస్ ఓటీటీ (Bigg Boss OTT) ట్యాగ్ లైన్. ఇకపై కేవలం గంట మాత్రమే కాకుండా.. 24 గంటలు వినోదాన్ని అందించనుంది ‏బిగ్‏బాస్ ఓటీటీ తెలుగు. ఇప్పటికీ ఓటీటీ లోగో ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఈనెల 26 నుంచి ‏బిగ్‏బాస్ ఓటీటీ షో ప్రారంభం కాబోతుందంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ఈనెల 26న నుంచి ప్రసారం కానుంది. ఇక గత సీజన్లకు హోస్ట్‏గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈ ఓటీటీ ‏బిగ్‏బాస్ షోకు హోస్ట్‏గా వ్యవహరించనున్నారు. అయితే ఈ షో ఈనెలలోనే ప్రారంభం కాబోతుందని తెలిసినప్పటి నుంచి ఇందులో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలోని పలువురు కంటెస్టెంట్స్‏తోపాటు.. సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారు కూడా పాల్గోనపోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ‏బిగ్‏బాస్ ఓటీటీ షో తెలుగు రేపటి నుంచి ప్రసారం కాబోతుందని తెలియజేస్తూ.. ఓ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అందులో ‏బిగ్‏బాస్ ఓటీటీ కొత్తింటిని చూపించారు. కొత్తింటిని నాగార్జున కూర్చుని.. ఇక పై ‏బిగ్‏బాస్ గంట మాత్రమే చూశారు.. ఇప్పుడు గ్యాప్ లేకుండా చూసేయండి అంటూ చెప్పుకొచ్చాడు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ‏బిగ్‏బాస్ ఓటీటీ ఇంటిని విభిన్నంగా..సరికొత్తగా కలర్‏ఫుల్‏గా డిసైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ షో రేపు (ఫిబ్రవరి 26న) సాయంత్రం 6 గంటలు స్ట్రీమింగ్ కానుట్లుగా ప్రకటించారు నిర్వాహకులు. మొత్తానికి ‏బిగ్‏బాస్ ఓటీటీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

ఇక ఇందులో పాల్గోనబోయే కంటెస్టెంట్స్‏ను సెలక్ట్ చేశారని.. వారిని క్వారంటైన్‏లో ఉంచారని సమాచారం. యాంకర్ స్రవంతి, ఆవకాయ సినిమా హీరోయిన్ బింధుమాధవి.. యాంకర్ శివ ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ కంటెస్టెంట్స్‏గా అందులో ధనరాజ్, ముమైత్ ఖాన్.. తనీష్, ఆదర్శ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, సరయూ, హమీదా, నటరాజ్ మాసర్ బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్స్ గా పాల్గోనబోతున్నట్లుగా టాక్.

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న