AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. విదేశాల్లోనూ భీమ్లా నాయక్‌ మంచి వసూళ్లను రాబడుతోంది...

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..
Cbn On Bheemla Nayak
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 25, 2022 | 12:38 PM

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. విదేశాల్లోనూ భీమ్లా నాయక్‌ మంచి వసూళ్లను రాబడుతోంది. భీమ్లా నాయక్‌ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా వచ్చి చేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ భీమ్లా నాయక్‌ చిత్రంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్‌ చేస్తూ పలు రకాల నిబంధనలు విధించిందంటూ  ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేష్.. భీమ్లా నాయక్‌ చిత్రంపై ట్విట్టర్‌ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వీరు ఏమన్నరాంటే..

జగన్‌ తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్రబాబు

భీమ్లా నాయక్‌ చిత్రంపై వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేసిందని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ‘ జగన్‌ చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది… నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ చంద్ర బాబు ట్వీట్ చేశారు.

భీమ్లా నాయక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది: లోకేష్‌

భీమ్లా నాయక్‌ చిత్రంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘భీమ్ల నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నాను. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు. భీమ్ల నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Also Read: ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆపై ఏం చేశాడంటే

Bike Rider: వాహనాలతో కిక్కిరిసిన హైవేపై రెండు బైకులు ఒకేసారి నడుపుతూ.. ఆస్కార్‌ ఇవ్వచ్చంటున్న నెటిజనం..వైరల్ వీడియో

Leopard-Dog Viral Video: చిరుతను పరుగులు పెట్టించిన వీధి కుక్క.. వినడానికి విచిత్రంగా ఉన్న వీడియో చుస్తే మీరు అవునాల్సిందే..