AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆపై ఏం చేశాడంటే

చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో....

ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆపై ఏం చేశాడంటే
Warangal Crime News
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 11:07 AM

Share

చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా గడిపేది. విషయం తెలుసుకున్న భర్త.. సమయం కోసం వేచి చూశాడు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడు. అంతే.. కోపంతో ఊగిపోయాడు. భార్యను అతని ప్రియుడిని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కర్నూలు(Kurnool) జిల్లా హొళగుంద మండలంలోని కోయిలతోట గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు గాయత్రి అనే మహిళతో పదేళ్ల క్రితం పెళ్లైంది. అదే గ్రామానికి చెందిన హనుమంతప్ప అనే వ్యక్తితో గాయత్రికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం భర్త శ్రీనివాస్​కు తెలిసింది. సమయం వచ్చినప్పుడు బయటపెట్టాలని వేచి చూడటంతో విషయం తెలిసినా తెలియనట్లు ప్రవర్తించాడు. ఈ క్రమంలో గాయత్రి ఫోన్ లో చూడకూడని దృశ్యాలను శ్రీనివాస్ చూశాడు. గాయత్రి, హనుమంతప్ప చనువుగా ఉన్నప్పుడు తీసిన వీడియోనూ చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తనకు వేరే పని ఉందని, ఆలస్యంగా ఇంటి వస్తానని చెప్పి బయటికి వెళ్లాడు. భర్త ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తాడోనని వేచి చూసిన గాయత్రి.. హనుమంతప్పకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని, ఇంటికి రావాలని కోరింది. గాయత్రి ఫోన్ చేయడంతో హనుమంతప్ప వారి ఇంటికి వెళ్లాడు. ఎవరూ లేరని అనుకొని శారీరకంగా కలిసేందుకు సిద్ధమయ్యారు.

ముందస్తు పథకం ప్రకారం బయటకు వెళ్లకుండా ఇంటి సమీపంలో ఉన్న శ్రీనివాస్.. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో వారిద్దరూ ఏకాంతంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోయాడు. విచక్షణ కోల్పోయి గొడ్డలితో హనుమంతప్పను నరికి చంపాడు. ఆ తర్వాత భార్య గాయత్రిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.

Also Read

Vijay Devarakonda: పాన్‌ ఇండియా చిత్రంగా విజయ్‌ – శివ సినిమా.? అందుకు ఇదే నిదర్శనమా..?

Russia-Ukraine War: ఒక్కరు కూడా తోడు లేరు.. ఒంటరి అయ్యాం: ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే..