మోకాళ్లపై నిలబెట్టేవాడు.. తీవ్రంగా కొట్టేవాడు.. భర్త వేధింపులు తాళలేక భర్య ఏం చేసిందంటే..

ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త ప్రతిరోజు నరకం చూపించేవాడు. మద్యం, గంజాయికి అలవాటు పడి క్రూరంగా ప్రవర్తించేవాడు. పెళ్లయి పదిహేనేళ్లయినా, ఇద్దరు పిల్లలున్నా అతని ప్రవర్తనలో..

మోకాళ్లపై నిలబెట్టేవాడు.. తీవ్రంగా కొట్టేవాడు.. భర్త వేధింపులు తాళలేక భర్య ఏం చేసిందంటే..
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 25, 2022 | 11:44 AM

ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త ప్రతిరోజు నరకం చూపించేవాడు. మద్యం, గంజాయికి అలవాటు పడి క్రూరంగా ప్రవర్తించేవాడు. పెళ్లయి పదిహేనేళ్లయినా, ఇద్దరు పిల్లలున్నా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఊర్లో వారితో అకారణంగా గొడవ పెట్టుకుని భార్యకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు. ఇక అతని వేధింపులు భరించలేక హత్య(Murder) చేయించాలని భార్య నిర్ణయించింది. ఈ మేరకు కిరాయి హంతకులతో సుపారీ మాట్లాడుకుని దారుణంగా హత మార్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. విశాఖపట్నం(visakhapatnam) జిల్లా ఆనందపురం మండలంలోని కొత్త కల్లివానిపాలెం గ్రామానికి చెందిన పైడిరాజుకు అప్పలకొండమ్మతో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. మద్యం, గంజాయికి బానిసైన పైడిరాజు భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. మోకాళ్లపై నిలబెట్టడం, గంజాయి పీల్చే స్నేహితులను ఇంటికి తెచ్చి అర్ధరాత్రులు వారికి సపర్యలు చేయమనడం వంటివి చేస్తూ తీవ్రంగా కొట్టేవాడు. ఊర్లో అందరితో గొడవలు పడుతూ వేధించేవాడు. విసుగు చెందిన భార్య..తన భర్తను చంపేయాలని నిర్ణయించింది.

హత్య కోసం కొత్త పరదేశిపాలెం, భీమిలి రెల్లివీధి, కృష్ణాకాలనీలకు చెందిన కిరాయి హంతకులు ఆదిబాబు, దుర్గయ్య, గణేశ్‌, అప్పలరాజులతో రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం వారితో కలిసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హత్య ఆధారాలు సేకరిస్తుండగా భార్య అప్పలకొండమ్మ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా.. వేధింపులు తాళలేక తన భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. హత్య కేసును ఆనందపురం పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు.

Also Read

ఇంటికి చేరే లోపే మృత్యు ఒడికి చేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Bike Rider: వాహనాలతో కిక్కిరిసిన హైవేపై రెండు బైకులు ఒకేసారి నడుపుతూ.. ఆస్కార్‌ ఇవ్వచ్చంటున్న నెటిజనం..వైరల్ వీడియో

Leopard-Dog Viral Video: చిరుతను పరుగులు పెట్టించిన వీధి కుక్క.. వినడానికి విచిత్రంగా ఉన్న వీడియో చుస్తే మీరు అవునాల్సిందే..