Bike Rider: వాహనాలతో కిక్కిరిసిన హైవేపై రెండు బైకులు ఒకేసారి నడుపుతూ.. ఆస్కార్‌ ఇవ్వచ్చంటున్న నెటిజనం..వైరల్ వీడియో

Bike Rider: వాహనాలతో కిక్కిరిసిన హైవేపై రెండు బైకులు ఒకేసారి నడుపుతూ.. ఆస్కార్‌ ఇవ్వచ్చంటున్న నెటిజనం..వైరల్ వీడియో

Anil kumar poka

|

Updated on: Feb 25, 2022 | 9:21 AM

ఈ రోజుల్లో ఏదైనా డిఫరెంట్‌గా చేసి నెట్టింట్లో వైరల్ కావలనే తపన యువతలో బాగా ఉంది. అయితే ఇందుకోసం చేసే స్టంట్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. మీరు ఇప్పటి వరకు చాలా రకాల హెవీ డ్రైవర్లను చూసి ఉంటారు.


ఈ రోజుల్లో ఏదైనా డిఫరెంట్‌గా చేసి నెట్టింట్లో వైరల్ కావలనే తపన యువతలో బాగా ఉంది. అయితే ఇందుకోసం చేసే స్టంట్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. మీరు ఇప్పటి వరకు చాలా రకాల హెవీ డ్రైవర్లను చూసి ఉంటారు. కొంతమంది బైకర్లు బైక్‌లతో విన్యాసాలు చేస్తూ కనిపిస్తుంటారు. ఇందుకోసం వారు తమ ప్రాణాలనుసైతం ఫణంగా పెడుతుంటారు. అంతే కాదు చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే… ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి రెండు మోటార్ సైకిళ్లను నడుపుతాడు. అది కూడా మాములు రోడ్డులో కాదు.. వాహనాలతో కిక్కిరిసిన హైవేపై ఇలా రెండు బైక్‌లు డ్రైవ్ చేసాడు. అతను ట్రాఫిక్ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఇలా రెండు బైక్‌లను నడపడమే కాదు… తలకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై యూజర్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. హెవీ డ్రైవర్ అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇతనికి ఆస్కార్ ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..