Ram gopal Varma: ‘భీమ్లా నాయక్ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ram gopal Varma: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకుపోతోంది...
Ram gopal Varma: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా భీమ్లా నాయక్‌కు సంబంధించిన చర్చే జరుగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ పడిందని పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చి చేరారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్టులు చేసే వర్మ.. భీమ్లా నాయక్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్‌పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘నేను ముందు నుంచి చెబుతున్నట్లు భీమ్లా నాయక్ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలి. ఈ సినిమా హిందీలో కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో.. ‘భీమ్లా నాయక్ ఒక మెరుపు, పవన్ కళ్యాణ్ సునామి. రానా కూడా పవన్‌తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు వర్మ. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ ఇలా సినిమాపై పొగడ్తలు కురిపించడంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.
Like I was repeatedly telling I so wish they released #BheemlaNayak in Hindi too ..It would have created an SENSATION
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022
The #BheemlaNayak is like a THUNDERSTORM..@PawanKalyan is like a TSUNAMI.. @RanaDaggubati is neck to neck ..Overall it’s an EARTHQUAKE ???
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022
ఇక పవన్ కళ్యాణ్, రానాలు నటించిన ఈ సినిమాను 2020లో మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు అందించారు. పవన్‌కు జోడిగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ విడదులైన ఈ సినిమా ఆశించిన స్థాయిలోనే విజయాన్ని అందుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Health Problems: తులసి ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా..?
ఇంటికి చేరే లోపే మృత్యు ఒడికి చేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇంటికి చేరే లోపే మృత్యు ఒడికి చేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి