UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. ఓటర్లకు అఖిలేష్ ఇచ్చిన ఆ హామీ గేమ్ ఛేంజర్ కానుందా?
Uttar Pradesh Assembly Election 2022: యూపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కమల దళం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే... అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది.

యూపీలో అధికారాన్ని(Uttar Pradesh)కైవసం చేసుకునేందుకు భారతీయ జనత పార్టీ(BJP) తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యూపీ పీఠాన్ని దక్కించుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ(samajwadi party) వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఉచిత హామీల గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది సమాజ్ వాదీ పార్టీ. యూపీ ప్రజలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో గెలిచేది ఎవరు..? ఎవరి పాచిక పారనుంది..? ఎన్ని పార్టీలో పోటీలో ఉన్నా.. ఆ రెండు పార్టీల మద్యే ప్రధాన పోటీ నెలకొంది. సరిగ్గా ఇదే రోజు రాజకీయ వలసలు కూడా ఊపందుకున్నాయి. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. అఖిలేష్ వేసిన పాచిక కమలంలో కొంత గుబులు పుట్టిస్తోంది.
యూపీలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న సుమారు 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యోగీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులను గాలి వదిలేశారని మండిపడ్డారు. విద్యా, ఉపాధి రంగాలను నిర్విర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉగ్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, 69 వేల టీచర్ల నియామకాలు చేపడతామని భరోసా ఇచ్చారు.
ఉచిత విద్యుత్ 300 యూనిట్ల వరకు.. రాష్ట్రంలో 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని అఖిలేష్ హామీలు గుప్పించారు. పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి ఎస్పీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాషాయ పార్టీ నేతలు తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు దగా కోరులకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల కోరులు ఓట్లు అడిగిందుకు మళ్లీ మీవద్దకు వచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కమలానికి ఎదురుగాలి వీస్తోందని ఎద్దేవా చేశారు.
ఇక పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని పునరుద్ధరిస్తానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న పార్టీకి ప్రధాన ఎన్నికల ప్రణాళికగా మారింది. చాలా కాలంగా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తున్న 16 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దృష్టిని అఖిలేష్ చేసిన హామీ ఆకర్షించింది. యుపి ఎన్నికలలో ఈ వాగ్దానం గేమ్ ఛేంజర్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనవరిలో అఖిలేష్ ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించి.. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు కోరారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులకు ఇది సహాయం చేస్తుందన్నారు. ఈ ప్రకటన వల్ల వచ్చే ఆర్థికపరమైన చిక్కులపై తాను ఇప్పటికే నిపుణులతో చర్చించానని..ఈ పథకం పునరుద్ధరణకు నిధులు సమకూర్చుకోగలనని యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో NDA హయాంలో కొత్త జాతీయ పెన్షన్ పథకం (NPS) రూపొందించింది. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో ఐదవ దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించే ప్రయత్నంలో సమాజ్ వాదీ పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ముందుకు తెచ్చింది. 2005లో ములాయం సింగ్ యాదవ్ యూపీలో అధికారంలో ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఎన్‌పిఎస్ కింద కొత్త మాన్యువల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏప్రిల్ 2005 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పదవీ విరమణపై భద్రత, మద్దతు నిరాకరించబడింది. అప్పటి నుంచి ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఎస్పీ పునరుజ్జీవనం బీజేపీకి చిక్కుల్లో పడింది. నష్టాన్ని నియంత్రించే ప్రయత్నంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పడింది. ఉద్యోగుల సంఘాలతో సమావేశం నిర్వహించి NPS ప్రయోజనాల గురించి వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. సీఎం ఇచ్చిన హామీలతో యూనియన్లు నమ్మకంగా ఉన్నాయి. ఆసక్తికరంగా OPS పునరుద్ధరణ డిమాండ్‌కు BSP అధినేత్రి మాయావతి కూడా మద్దతు ఇచ్చారు. రెండు పథకాల మధ్య సమతూకం పాటించడం ద్వారా పరిష్కారానికి కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్, అమెరికాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్..
Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..