AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: ఆ లిప్ లాక్ సీన్ వివాదాస్పదం చేస్తారని నాకు అప్పుడే తెలుసు.. హీరోయిన్ నిత్యా మీనన్..

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ నిత్యా మీనన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు... తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా తాను నటించిన ఓ సినిమాలోని లిప్ లాక్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ నిత్య నటించిన ఈ సిరీస్ ఏంటో తెలుసా..

Nithya Menen: ఆ లిప్ లాక్ సీన్ వివాదాస్పదం చేస్తారని నాకు అప్పుడే తెలుసు.. హీరోయిన్ నిత్యా మీనన్..
Nithya Menen
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2025 | 9:58 PM

Share

నిత్యా మీనన్ సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. 1998లో ‘హనుమాన్’ అనే ఇంగ్లీష్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. 2006లో ‘7 ఓ’క్లాక్’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2008లో, కె.పి. కుమరన్ రచన , దర్శకత్వం వహించిన మోహన్ లాల్ నటించిన ‘ఆకాశ గోపురం’ చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, కన్నడతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘బ్రీత్’; నిత్యా ‘ఇంటు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో అభిషేక్ బచ్చన్ హీరో.

ఈ సిరీస్‌లో నిత్య, శ్రుతి బాప్నా మధ్య లిప్ లాక్ సన్నివేశం పెద్ద చర్చనీయాంశమైంది. దాని గురించి తలెత్తిన వివాదాలపై నిత్యా స్పందించింది. నిత్యా మీనన్ ఇటీవల ఒక మహిళా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించింది. “నేను హిందీలో బ్రీత్ ఇన్ టు ది షాడోస్ అనే వెబ్ సిరీస్ లో నటించాను. అది మంచి షూటింగ్ అనుభవం. అది నా కెరీర్ లో కూడా మైలురాయి. ఆ సిరీస్ లోని ఆ లిప్ లాక్ సన్నివేశం సినిమా మొత్తం మూడ్ కి చాలా ముఖ్యమైనది. కానీ ఆ సీన్ చేసినప్పుడు పెద్ద వివాదం ఏర్పడుతుందని నాకు అప్పుడే తెలుసు. స్క్రిప్ట్ లో అలాంటి సన్నివేశం అవసరమైతే, భవిష్యత్ సినిమాల్లో కూడా చేయడానికి నేను వెనుకాడను. నేను అప్పుడూ, ఇప్పుడూ ఇలాంటి వివాదాలకు ఎప్పుడూ భయపడలేదు. చాలా వివాదాలు తలెత్తినప్పుడు, అది నా చెవులకు చేరే చివరి విషయం. అయినప్పటికీ, నేను సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చదివాను.

కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే.. నెగిటివ్ కామెంట్స్ లేకుండా సానుకూలంగా ఏమీ జరగదు. నేను దాని గురించి ఆలోచించను. అప్పుడే నాకు దానికి సమయం దొరుకుతుంది. ఇతరులు ఏమనుకుంటారో అని చింతిస్తూ, ఒత్తిడిలో నేను పని చేయలేను. నా వ్యవహారాలు నేనే నిర్ణయించుకుంటాను. నా మనసులో నాకు అనిపించే దాని ప్రకారం జీవించడం నాకు ఇష్టం. నేను చెప్పేది, చేసేది అన్నీ నా మనసు చెప్పినట్టే ఉంటాయి. “నా నిర్ణయాలను లేదా నా ఆనందాన్ని బయటి ఏదీ ప్రభావితం చేయదు” అని నిత్యా మీనన్ అన్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ