Srikanth Addala: ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్! ఇద్దరూ కలిసే ఉంటున్నారా?
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తీసింది తక్కువ సినిమాలే అయినా కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్లాసిక్ సినిమాలను తెరకెక్కించాడు. అలాంటి డైరెక్టర్ గురించి ఇప్పుడు ఒక వార్త తెగ వైరలవుతోంది.

కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. అంతకు ముందు పలు డైరెక్టర్ల వ్ద, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారాయ. ఇక రెండో మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత కూడా ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప, పెద కాపు సినిమాలతో టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సాధారణంగా సినిమా విషయాలతో తప్పితే పెద్దగా వార్తల్లో నిలవని శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఒక ఆసక్తికర విషయంతో అందరి నోళ్లల్లో నానుతున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ గురించి గత కొద్ది రోజులుగా కొన్ని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన సతీమణితో పలు విభేదాలు రావడంతో శ్రీకాంత్ అడ్డాల ఓ కోలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే వీరిద్దరు చెన్నైలో కలిసి ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు పార్ధిబన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడారు. కోలీవుడ్‌లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయి బ్రిగిడా సాగాతోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్‌లో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే విషయంపై ఇంటర్వ్యూలో పార్తీబన్ కు ఒక ప్రశ్న ఎదురైంది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల- నటి బ్రిగిడా సాగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న రూమర్లు నిజమేనా అని పార్తీబన్ ను ప్రశ్నించగా.. ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ‘బ్రిగిడాను నేనే సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాను కాబట్టి చాలామంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. కానీ, ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా సులువుగా చేస్తుంది. తనలో నటన పరంగా చాలా మంచి ట్యాలెంట్ ఉంది. అయితే ఇలాంటి రూమర్లను ఆమె పెద్దగా పట్టించుకోదు. ఆమె ఇప్పుడు నాతో టచ్‌లో లేదు. ఆమె కల కేవలం సినిమా మాత్రమే.. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్‌ను నాశనం చేసుకోదను కుంటున్నాను. వారిద్దరి మధ్య ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను’ అని క్లారిటీ ఇచ్చారు పార్తీబన్.
బ్రిగిడా సాగా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
బ్రిగిడా సాగా విషయానికి వస్తే.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రల్లో కనిపించింది. పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల నే దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై ఆయన సతీమణి రాగసుధాతో కూడ డైరెక్టర్ కువిభేదాలు వచ్చాయని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. వీటిపై శ్రీకాంత్ అడ్డాల కానీ, బ్రిగిడా కానీ ఎక్కడా అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.