విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్ళీ కలకలం.. ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగసిపడటంతో భయం భయం..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాద భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నెల 8న జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే, తాజాగా ఎస్‌ఎమ్‌ఎస్-1 యూనిట్‌లో ల్యాడిల్ నుంచి ఫైర్‌బాల్ ఎగసిపడటంతో కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, వరుసగా చోటుచేసుకుంటున్న స్వల్ప ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నాసిరకం ముడి పదార్థాలు, నాణ్యత నియంత్రణ లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తూ, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భయం వీడడం లేదు. ఈనెల 8న పదిమంది ప్రాణాలు కలిగి ఉన్న ప్రమాదం నుంచి ఇంకా తేరుకోక ముందే.. అడపాదడపా జరుగుతున్న స్వల్ప ప్రమాదాలు కార్మికులను ఉక్కిరి బికిరి చేస్తున్నాయి. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తాజాగా ఎస్ఎంఎస్ 1 లో ల్యాడిల్ నుంచి ఫైర్ బాల్ ఎగసిపడడంతో.. మరోసారి కలకలం రేగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కార్మికుల బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సి వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడు కార్మికులు భయం భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాడిలో పేలుడు సంభవించి.. ఉక్కు ద్రవం మీద పడి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై నిపుణుల విచారణ చేస్తూ ఉంది. పోలీస్ విచారణ కూడా మరోవైపు కొనసాగుతోంది. ఆ ఘటన జరిగిన తర్వాత కూడా ఎస్ఎంఎస్ 1, 2 లో ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదం జరిగిన రోజు కూడా అరగంట ముందు ఎస్ఎంఎస్ టు లో అటువంటి ప్రమాదమే జరిగింది ఈ ఎవరికీ ఎటువంటి ముప్పు లేదు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే.. పదిమంది ప్రాణాలు తీసిన ఘటన మరిచిపోక ముందే.. స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అడప దడప ప్రమాదాలు కార్మికులకు భయాందోళన గురిచేస్తున్నాయి.
తాజాగా శుక్రవారం నాడు ఎస్ఎంఎస్ 1లో స్వల్ప ప్రమాదం కార్మికులను పరుగులు పెట్టించింది. మెషిన్ నెంబర్1 వద్ద 98 నెంబరు హీట్ తీస్తున్నప్పుడు కాస్టింగ్ జరుగుతుండగా ఫైర్ బాల్ ఒక్కసారిగా ఎగససి పడింది. అంతా అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హాట్ మెటల్ కు అల్యూమినియం కలిపిన తర్వాత రిన్సింగ్ సరిగా జరగకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్టు కార్మికులు ఉద్యోగులు అధికారులు చర్చించుకుంటున్నారు.
అయితే, హాట్ మెడల్ ప్యూరిఫికేషన్ ఇతర ముడి పదార్థాలు నాసిరకం కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు నిర్వహించి ఉద్యోగుల కార్మికుల ప్రాణాల భద్రతకు భరోసా కల్పించాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
