AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. ఈ రోజే..

ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనుండగా.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి రూ.7 వేలు జమ కానున్నాయి.

Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. ఈ రోజే..
Ap Annadatha Sukhibhava To Farmers
Venkatrao Lella
|

Updated on: Jun 20, 2026 | 7:18 AM

Share

ఏపీలోని రైతులు పండుగ చేసుకునే వార్త. ఇవాళ ఒకేసారి అకౌంట్లో రూ.7 వేలు పడనున్నాయి. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద నిధులను కూటమి ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. ఈ స్కీమ్ కింద నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. దీని ద్వారా 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున ఇవాళ పడనున్నాయి. రాష్ట్ర వాటా రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు ఒకేసారి ఖాతాల్లో వేయనున్నారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుండగా.. ఏపీ సీఎం చంద్రబాబు చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి కానున్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా అన్నదాత సుఖీభవ పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

మూడు విడతల్లో రూ.8,985 కోట్లు

అన్నదాత సుఖీభవ పథకం కింద భూ యజమాని రైతులు 45.69 లక్షలు, RoFR రైతులు 1.16 లక్షల మంది లబ్ది చేకూరనుంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు అందిస్తోంది. పీఎం కిసాన్ పథకంతో కూటమి ప్రభుత్వం స్కీమ్ అమలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించారు. మూడు విడతల్లో మొత్తం రూ.8,985 కోట్లను విడుదల చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవి ఉపయోగపడ్డాయని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యం చిన్న, సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో ఏపీలో పంట సాగు మొదలవుతుంది. దీంతో ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్ధిక సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు పెట్టుబడి సాయం వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరిక్షణకు తెరపడింది. ఈ రోజు అకౌంట్లలో పడనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అర్హులు ఎవరంటే..?

-ఏపీ నివాసి అయి ఉండాలి

-పీఎం కిసాన్‌లో నమోదై ఉండాలి

-ఈకేవైసీ పూర్తి చేయాలి

-భూమి రికార్డులు కలిగి ఉండాలి

-ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ తప్పనిసరి

-బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి

-పట్టాదారు పాసు పుస్తకాల్లో పేరు కరెక్ట్‌గా ఉండాలి

Follow Us