AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్‌డ్రింక్ తయారీ సంస్థలకు FSSAI బిగ్‌ షాక్.. లేబుళ్లపై వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కూల్‌డ్రింక్స్ తయరీ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది.ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల లేబుళ్లపై ఎనర్జీ డ్రింక్ అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనలను తక్షణమే తొలగించాలని తెలిపింది.

కూల్‌డ్రింక్ తయారీ సంస్థలకు FSSAI బిగ్‌ షాక్.. లేబుళ్లపై వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం!
Fssai Bans Energy Drink Label
Anand T
|

Updated on: Jul 31, 2026 | 8:58 AM

Share

దేశంలో వ్యాప్తంగా ఉన్న కూల్‌డ్రింక్ తయారీ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది, ఆయా కంపెనీ తక్షణమే తమ ఉత్పత్తుల లేబుళ్లపై ఉన్న ఎనర్జీ డ్రింక్స్ అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనను తొలగించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రముఖ కూల్‌డ్రింక్ తయారీ సంస్థలైన పెప్సికో, రెడ్ బుల్, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ తదితర సంస్థలు తమ FSSAI మార్గదర్శకాలు జారీ చేసింది.

FSSAI నిర్ణయంతో కొత్త ఉత్పత్తుల తయారీ నిలిచిపోయినప్పటికీ, మార్కెట్లో ఉన్న పాత నిల్వలను విక్రయించడం కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.ఈ నిర్ణయం తర్వాత ఒక ప్రముఖ కూల్‌డ్రింక్ తయారీ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. రోడ్‌సైడ్ స్టాల్స్, ధాబాలు, చిన్న కిరాణా షాపులు లిమిటెడ్‌గా సరుకును కొనుగోలు చేస్తున్నప్పటికీ.. సూపర్ మార్కెట్లు, పెద్ద రిటైల్ చైన్లకు సరఫరా చేసే బడా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం త్వరలో లేబుళ్లు మార్చాల్సి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని స్టాక్ తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లేబుల్లపై ఉన్న ఎనర్జీ డ్రింక్ అనే పదాన్ని తొలగించేందుకు కంపెనీలకు 90 రోజుల గడువు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. గడువు పెంపు కోసం కంపెనీలు చేసిన విజ్ఞప్తులను FSSAI తోసిపుచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

FSSAI చర్యలకు కారణమేంటి?

FSSAI ఈ చర్యలు తీసుకోవడానికి మనదేశంలో ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట ప్రమాణాలు లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనికి తోడు, ఈ పానీయాల ప్రకటనల్లో వాడే పదాలపై కూడా FSSAI తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు, ప్రచారాలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.

FSSAI తాజా ఆదేశాల నేపథ్యంలో కూల్‌డ్రింక్ తయారీ కంపెనీలు తమ ప్యాకేజింగ్, మార్కెటింగ్ వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.2028 నాటికి భారతదేశంలో 1.6 బిలియన్ల మార్కెట్ విలువను చేరుకుంటుందని భావిస్తున్న ఈ రంగానికి FSSAI నిర్ణయం పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు.ఈ నిర్ణయంపై ఈక్వినాక్స్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్ భద్రి మాట్లాడుతూ, ఈ పరిణామం కేవలం ఎనర్జీ డ్రింక్ రంగానికే కాకుండా మొత్తం ఆహార పరిశ్రమకే సంకేతమని తెలిపారు

భారతదేశంలో ఆహార నిబంధనల అమలు ఏ విధంగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని. ఇది కేవలం ఎనర్జీ డ్రింక్స్‌కే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఇతర ఫుడ్ కేటగిరీలకు కూడా విస్తరించవచ్చని అన్నారు. కంపెనీలు చేసే ఆధారాలు లేని ప్రకటనల వలన వ్యాపార, బ్రాండ్ ఇమేజ్‌కి ముప్పు వాటిల్లుతుందని. ఇకపై కేవలం మార్కెటింగ్ బృందాలే కాకుండా, లీగల్, రెగ్యులేటరీ బృందాలు కూడా ఉత్పత్తి ఆరంభ దశ నుంచే భాగస్వామ్యం కావాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కూల్‌డ్రింక్ తయారీ సంస్థలకు FSSAI బిగ్‌ షాక్..
కూల్‌డ్రింక్ తయారీ సంస్థలకు FSSAI బిగ్‌ షాక్..
ఇది తింటే 95 ఏళ్ళ వయస్సులో నడవలేని వాళ్ళు కూడా పరుగులు పెడతారు
ఇది తింటే 95 ఏళ్ళ వయస్సులో నడవలేని వాళ్ళు కూడా పరుగులు పెడతారు
యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు.. ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు.. ట్రంప్ కీలక ప్రకటన..!
మటన్‌ ప్రియులారా..బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా? శరీరంలో జరిగేది
మటన్‌ ప్రియులారా..బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా? శరీరంలో జరిగేది
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ హవా.. కానీ పతకాల పట్టికలో వెనుకడుగు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
వ్యభిచార కేసులో అరెస్ట్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇలా
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
అర్థరాత్రి పేకమేడలా కూలిన 4 అంతస్తుల భవనం..!
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కేవలం రెండు ఆకులు చాలు.. 102 జ్వరంతో మండిపోతోన్న బాడీ చల్లగా
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు
కారం, ఎలక్ట్రిక్ లాఠీలు.. పోలీసుల అంజలి కిట్ ప్రత్యేకతలు