AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి వేధించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
Rega Kantha Rao
Balaraju Goud
|

Updated on: Jul 31, 2026 | 11:37 AM

Share

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి వేధించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహిత సంబంధం కొనసాగించారని, ఆ తర్వాత మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా తన మొబైల్ ఫోన్‌కు యాక్సెస్ పొంది, తన స్నేహితురాలితో కూడా ఇదే విధంగా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఫిర్యాదుపై జూలై 26వ తేదీన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాల సేకరణ, బాధితురాలి వాంగ్మూలం, ఇతర సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆరోపణలపై రేగా కాంతారావు స్పందన తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి